Begin typing your search above and press return to search.

చండ్ర‌ నిప్పుల్లో మే రిలీజెస్

By:  Tupaki Desk   |   2 May 2019 1:30 AM GMT
చండ్ర‌ నిప్పుల్లో మే రిలీజెస్
X
మండే ఎండ‌ల్లో దూసుకొస్తున్నారు మన హీరోలు. సూర్యుడు చండ్ర నిప్పులు చెరుగుతున్నా.. భ‌యం బెరుకు లేకుండా బ‌రిలో దిగేస్తున్నారు. అయితే ఇలా వ‌చ్చే వాళ్ల‌కు `మే` అంటే భ‌య‌మే లేదా? అంటూ ఫ్యాన్స్ లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. అస‌లింత‌కీ ఈ నెల‌లో ఎన్ని సినిమాలు రిలీజ‌వుతున్నాయి? అంటే సుమారు రెండు డ‌జ‌న్ల సినిమాలు రిలీజ్ క్యూలో ఉన్నాయ‌ని తెలుస్తోంది.

మ‌హేష్ న‌టించిన `మ‌హ‌ర్షి` ఈ సీజ‌న్ లో అత్యంత క్రేజీగా రిలీజ‌వుతోంది. మే 9న డేట్ ఫిక్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో పాటే.. నిఖిల్ న‌టించిన‌ అర్జున్ సుర‌వ‌రం మే 1న రిలీజ‌వుతోంది. టీజ‌ర్ తో ఆక‌ట్టుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఎంతో కొంత మ్యాజిక్ చేస్తుంద‌న్న అంచ‌నాలున్నాయి. ఇక దేవ‌ర‌కొండ డియ‌ర్ కామ్రేడ్ .. రాజ‌శేఖ‌ర్ క‌ల్కిపైనా అభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఈ నెల‌లో మ‌రో భారీ సినిమా ఎన్ జీకే ప్ర‌మోష‌న్స్ ఇప్ప‌టికే మొద‌ల‌య్యాయి. అభినేత్రి 2- నువ్వు తోపురా-సువ‌ర్ణ సుంద‌రి- వ‌జ్ర‌క‌వ‌చ‌ధ‌ర గోవింద-హీరో హీరోయిన్- రంగు ప‌డుద్ది-ఎవ‌రికీ చెప్పొద్దు- కిల్ల‌ర్ - ఆప‌రేష‌న్ గోల్డ్ ఫిష్‌- నాగ‌క‌న్య‌- ఫ‌ల‌క్ నుమా దాస్- అర్జున (రాజ‌శేఖ‌ర్)- సెవ‌న్ -ఏబీసీడీ- ఇస్మార్ట్ శంక‌ర్- ఊరంతా అనుకుంటున్నారు- ఏడు చేప‌ల క‌థ‌- క‌ల్కి- మ‌ల్లేశం- ఏదైనా జ‌ర‌గొచ్చు- సీత‌- ఓట‌ర్ ఇన్ని సినిమాలు క్యూలో ఉన్నాయి. ఇవే గాక ఇంకా తేదీలు క‌న్ఫామ్ కానివి చాలా సినిమాలు ఉన్నాయి.

వ‌రుస‌గా ప్ర‌తి శుక్ర‌వారం రిలీజ్ లు ఉన్నాయి. ఇప్ప‌టివ‌ర‌కూ తేదీల్ని లాక్ చేసుకున్న సినిమాల వివ‌రాల్ని ప‌రిశీలిస్తే.. సుధాక‌ర్ కోమాకుల‌- నువ్వు తోపురా.. ర‌ష్మిక‌- గీత ఛలో (డబ్బింగ్) చిత్రాలు మే 3న రిలీజ‌వుతున్నాయి. డ‌బ్బింగ్ సినిమా `నాగ‌క‌న్య` మే 10న రిలీజ‌వుతోంది. మే11న `ఎవడు త‌క్కువ కాదు`.. మే 24న సీత (కాజ‌ల్- బెల్లంకొండ‌) రిలీజ్ కానున్నాయి. మే 17న అల్లు శిరీష్- ఏబిసిడి .. రామ్- ఇస్మార్ట్ శంకర్ పోటీప‌డ‌నున్నాయి. ఆ త‌ర్వాత‌ మే 31న సూర్య -ఎన్‌ జీకే.. దేవ‌ర‌కొండ -డియర్ కామ్రేడ్.. ప్ర‌భుదేవా -అభినేత్రి 2 చిత్రాలు రిలీజ‌వుతున్నాయి. ఎండ‌ల‌కు భ‌య‌ప‌డి థియేట‌ర్ల‌కు వ‌చ్చేందుకు జ‌నం బెంబేలెత్తుతున్నా.. మన మేక‌ర్స్ మాత్రం రిలీజ్ ల విష‌యంలో ఏమాత్రం త‌గ్గ‌క‌పోవ‌డం చ‌ర్చ‌కొస్తోంది. బ‌హుశా స్కూల్- కాలేజ్ సెల‌వులు త‌మ‌కు క‌లిసొస్తాయ‌నే ఆలోచ‌న‌.. మునుముందు భారీ రిలీజ్ ల‌తో పోటీప‌డే ఛాన్సే లేద‌నే ఆలోచ‌న‌తో ఇలా రిలీజ్ ప్లాన్ చేస్తున్నార‌ని భావించ‌వ‌చ్చు.