Begin typing your search above and press return to search.
మే డే స్పెషల్.. ట్రెండ్ అవుతున్న ఎర్రన్న సినిమా సీన్స్
By: Tupaki Desk | 1 May 2021 10:50 AM GMTనేడు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్బంగా ప్రపంచ వ్యాప్తంగా కార్మికులు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాడు. ఇండియాలో కూడా మేడేను పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉంటారు. మే డేను జాతీయ హాలీడేగా ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా మేడే కార్యక్రమాలు ఒకలా జరిగితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మే డే కార్యక్రమాలు మరో విధంగా జరుగుతాయి అనడంలో సందేహం లేదు. తెలుగు రాష్ట్రాల్లో జరిగే మే డే కార్యక్రమాల్లో ఎర్రన్న ఆర్ నారాయణ మూర్తి ప్రస్థావన.. పేరు.. ఆయన సినిమాల వీడియోలు ఖచ్చితంగా షేర్ అవుతూ ఉంటాయి.
ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా తెలుగు రాష్ట్రాల నెటిజన్స్ సోషల్ మీడియాలో ఆర్ నారాయణ మూర్తి వీడియోలు మరియు ఫొటోలను షేర్ చేస్తూ మే డే వర్ధిల్లాలి అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. కార్మికులు అనగానే అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా జనాలకు ఆర్ నారాయణ మూర్తి గుర్తుకు వస్తున్నాడు. అందుకే ఈ ఏడాది కూడా మే డే సందర్బంగా సోషల్ మీడియాలో ఎర్రన్న నారాయణ మూర్తి సినిమాల క్లిప్లింగ్స్ ట్రెండ్ అవుతున్నాయి.
కార్మికుడిగా.. కర్షకుడిగా ఇంకా ఎన్నో రకాల పాత్రల్లో నటించి మనలో ఒకడు అంటూ సామాన్యులతో అనిపించుకున్న ఆర్ నారాయణ మూర్తి ఇప్పటికి కమర్షియల్ సినిమా ల జోలికి వెళ్లకుండా ప్రజా సమస్యలపై మాత్రమే సినిమా లు చేస్తూ ఉన్నాడు. గతంలో మాదిరిగా ఎర్రన్న సినిమా ల జోరు మాత్రం కనిపించడం లేదు. మెల్లగా సినిమా లను చేస్తూ ప్రజల్లో చైతన్యం తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.