Begin typing your search above and press return to search.
లిరికల్ వీడియో: మాజ్ఞా మాజ్ఞా.. లవ్ కిక్కు ఎక్కేత్తోందే!
By: Tupaki Desk | 13 Jun 2022 3:21 PM GMTఅన్నం ఉడికిందో లేదో మెతుకు పట్టుకుని చెప్పొచ్చు. సినిమాలో కంటెంట్ ఎలాంటిదో సాంగ్ చూసి చెప్పొచ్చు. తాజాగా విడుదలైన మాజా మాజా లిరికల్ వీడియో చూడగానే ఇది పక్కా కాలేజ్ యూత్ లవ్ స్టోరి అని ఇట్టే అర్థమవుతోంది.
అందమైన అమ్మాయి.. అమ్మాయి వెంట పడే అబ్బాయి.. కాలేజ్ వాతావరణం ... అల్లరి చిల్లర స్టూడెంట్స్ .. స్నేహితుల బృందం.. క్లాస్ రూమ్స్ పాఠాలు .. వోర చూపులు.. కొంటె బాణాలు.. వగైరా వగైరా చూడగానే ఇది ఒక ఆహ్లాదకరమైన కాలేజ్ లవ్ స్టోరి అని అర్థమవుతోంది. ఇక కాలేజ్ ప్రేమకథలు అంటే లిరిసిస్టులు కూడా అంతే రెచ్చిపోయి అదిరిపోయే పదజాలంతో మెరుపులు మెరిపిస్తుంటారు.
`ఫస్ట్ డే ఫస్ట్ షో` అనేది ఈ మూవీ టైటిల్. ఈ మూవీ థీమ్ ని ఎలివేట్ చేసే పాట మాజ్ఞా మాజ్ఞా. నా గుండె గిలా గిలా కొట్టుకుంటోందే.. అంటూ టేకాఫ్ చేసిన లిరిసిస్ట్ ఆజా ఆజా అంటూనే బోలెడన్ని గమ్మత్తయిన పదాలతో మ్యాజిక్ చేసారు. ప్లెజెంట్ ట్యూన్ ఆకట్టుకుంది. ఇటీవలి కాలంలో ఈ తరహా ప్రేమకథలు అడపాదడపా వస్తున్నాయి. కానీ ఈ సినిమాలో చూపించే కొత్త పాయింట్ ఏమిటీ అన్నది బొమ్మ ఆడేందుకు కారణం కావొచ్చు.
`ఫస్ట్ డే ఫస్ట్ షో` అన్న టైటిల్ తోనే ప్రేమకథలో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ వ్యవహారాన్ని టచ్ చేస్తున్నారని కూడా హింట్ ఇచ్చారు. మొదటి లిరికల్ వీడియో మజ్జా మజ్జా సినిమా టోన్ ఏంటో చెబుతోంది. శ్రీజ ఎంటర్ టైన్ మెంట్స్ - మిత్రవింద మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రముఖ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు స్థాపించిన పూర్ణోదయ బ్యానర్ ఇప్పుడు శ్రీజ ఎంటర్ టైన్ మెంట్స్ తో తిరిగి నిర్మాణంలోకి వచ్చింది. మిత్రవింద మూవీస్ తో కలిసి ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ఆయన కుమారుడు ఏడిద శ్రీరామ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
FDFS అనేది తదుపరి కాలపు కామెడీ ఎంటర్ టైనర్. ఈ చిత్రానికి రధన్ సంగీతాన్ని అందించారు. మేకర్స్ మొదటి లిరికల్ వీడియోతో ఆడియో ప్రమోషన్ లను ప్రారంభించారు. వంశీధర్ గౌడ్- వాసు వలబోజుల తెలంగాణ యాసలో సాహిత్యం అందించగా క్యాచీ లిరిక్ ఆకట్టుకుంది. ఈ ట్రాక్ కి ఆంథోని దాసన్ స్వరాలు అందించగా.. విశ్వ రఘు మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. నాయకానాయికలు తొలి పరిచయం.. హీరో శ్రీకాంత్ రెడ్డి తన డ్యాన్స్ మూవ్స్ తో ఆకట్టుకోగా.. సంచితా బషు అందమైన ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంది. ఈ పాట హీరో తన ప్రేమ భావాలను పలికించే రొమాంటిక్ సాంగ్.
ఈ చిత్రానికి జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ కెవి రచన అదనపు అస్సెట కానుంది. ఈ చిత్రానికి కథ అందించిన ఆయన వంశీధర్ గౌడ్- కళ్యాణ్ లతో పాటు స్క్రీన్ ప్లే కూడా అందించారు. ఈ చిత్రానికి డైలాగ్స్ ను అనుదీప్ కెవి - వంశీధర్ గౌడ్ రాశారు. వంశీధర్ గౌడ్ - లక్ష్మీనారాయణ పి కలిసి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రశాంత్ అంకిరెడ్డి సినిమాటోగ్రాఫర్ కాగా.. మాధవ్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. తనికెళ్ల భరణి- వెన్నెల కిషోర్- శ్రీనివాస్ రెడ్డి- మహేష్ ఆచంట- ప్రభాస్ శ్రీను- గంగవ్వ- సివిఎల్ నరసింహారావు- వంశీధర్ గౌడ్ - సాయి చరణ్ బొజ్జా తదితరులు నటిస్తున్నారు. ప్రశాంత్ అంకిరెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.