Begin typing your search above and press return to search.
టాలీవుడ్ హెడ్స్ పై #METOO గన్!
By: Tupaki Desk | 16 Oct 2018 3:22 AM GMT#METOO ఉద్యమం ప్రపంచాన్ని దావానలంలా చుట్టేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా భారతదేశంలో అన్ని రంగాల్ని ఈ ఉద్యమం ఓ ఊపు ఊపేస్తోంది. అన్నిచోట్లా బాధితురాళ్లు నేరుగా సామాజిక మాధ్యమాల వేదికగా ఆధారాల్ని బయటపెడుతూ, తమపై జరిగిన రాక్షస కాండను బయటకు చెప్పేస్తుండడంతో అందుకు కారకులైన వారు బయటకు రాక తప్పడం లేదు. పోలీస్ విచారణను ఎదుర్కోవాల్సి వస్తోంది. బాలీవుడ్‌లో నానా పటేకర్, సుభాష్ ఘాయ్, అలోక్ నాథ్, వికాస్ బాల్ .. ఒకరేమిటి ఈ జాబితా చాంతాడంత పెరుగుతూనే ఉంది. ఇది ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీస్‌ని, ముఖ్యంగా టాలీవుడ్‌ని ఓ కుదుపు కుదిపేయడం ఖాయమన్న మాటా వినిపిస్తోంది. ఇక్కడ పెద్ద తలకాయల పేర్లు బయటకు వస్తాయన్న ఆందోళనా అప్పుడే మొదలైంది. కొందరు గుమ్మడికాయ దొంగలైతే ఆ మేరకు తమపై ఎలాంటి వివాదం తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట.
టాలీవుడ్‌లోనూ మీటూ ఉద్యమం దూసుకెళ్లడానికి ఆస్కారం ఉంది. అందుకు మహిళా శక్తులే కదలిరావడం, ప్రత్యేకించి రామానాయుడు స్టూడియోస్‌లో సమావేశం కావడంతో అసలు కథ మొదలైంది. మీటూ క్యాంపెయినింగ్ కోసమే ఈ మీటింగ్ ని కండక్ట్ చేశారు. మన పరిశ్రమలోనూ ఇన్నాళ్లు బోలెడన్ని దురాగతాలు జరిగాయి. వాటన్నిటినీ మీటూ క్యాంపెయినింగ్‌లో బయటపెట్టాలని, బాధితురాళ్లను కోరారు. అక్కినేని కోడలు సమంత అండదండలతో మహిళా దర్శకురాలు నందిని రెడ్డి, యాంకర్ ఝాన్సీ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు రెడీ అయ్యారు. ఇది ఊహించని పరిణామంగానూ కొందరు భావిస్తున్నారు.
టాలీవుడ్‌లో ఎవరికి ఎప్పుడు ఏ ఆపద తలెత్తినా, వేధింపులు ఎదురైనా వాటన్నిటినీ వీళ్లకు చెప్పుకోవచ్చు. ఈ ఉద్యమంలో భాగం కావొచ్చు. నందినిరెడ్డి, సమంత, ఝాన్సీ, చిన్మయి వంటి బిగ్ హెడ్స్ ఇనిషియేషన్ తీసుకోవడంతో ధైర్యంగా తమ విషయంలో జరిగిన అన్యాయాన్ని చెప్పుకోవచ్చన్న భరోసా కనిపిస్తోంది. ఎవరైనా ఇక్కడ సమస్యలు చెప్పుకోవచ్చు. అయితే ఇలాంటి కీలక విషయంలో ఇంతకీ మూవీ ఆర్టిస్టుల సంఘం తరపున `కాష్` కమిటీ ఏం చేస్తోంది? అన్నది ఓ ప్రశ్నార్థకం. ఇదివరకూ శ్రీరెడ్డి, మాధవీలత వంటి నటీమణులు చేసింది ఏంటి? వాళ్లు చేసింది మీటూ ఉద్యమం కాదా? అన్న ప్రశ్న తలెత్తింది. పెద్ద స్థాయిలో అండదండల విషయంలో సరైన వేదికను వెతుక్కోకపోవడమే వీళ్ల ప్రయత్నం సఫలం కాలేదా? అన్న కొత్త సందేహం ఈ సందర్భంగా వ్యక్తమవుతోంది. శ్రీరెడ్డి, మాధవీలత వంటి నటీమణులు మీడియా ముందే అంతగా ఆవేదన చెందినా ఎవరూ పట్టించుకోలేదు. శ్రీరెడ్డి ఆవేదన అరణ్య రోదనగానే మిగిలిపోయింది. అయితే ఇప్పుడు సమంత, నందిని రెడ్డి అంతటి పెద్ద స్థాయి సెలబ్రిటీలు బరిలో దిగారు కాబట్టి, ఇకపై టాలీవుడ్‌లోనూ ప్రకంపనాలు ఖాయమేనన్న మాటా వినిపిస్తోంది.