Begin typing your search above and press return to search.
రష్మిక టాటూ వెనక టాప్ సీక్రెట్
By: Tupaki Desk | 17 Jan 2023 4:47 AM GMTనేషనల్ క్రష్ రష్మిక భారతీయ సినిమాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణులలో ఒకరు. బ్లాక్ బస్టర్ పుష్ప: ది రైజ్ లో అల్లు అర్జున్ సరసన శ్రీవల్లి పాత్రతో ఆకట్టుకున్న తర్వాత ఆమె గత సంవత్సరం వికాస్ బహ్ల్ ఎమోషనల్ డ్రామా గుడ్ బై తో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. దీనిలో ఆమె లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ తో కలిసి నటించింది.
రష్మిక తరచుగా ఫోటోషూట్లలో తన 'ఇర్రీప్లేసబుల్' టాటూను ప్రదర్శిస్తూ ఉంటుంది. ఇన్ స్టాలో తన అభిమానులు అనుచరులతో ఈ టాటూని పంచుకుంటుంది. అయితే తాజా ఇంటర్వ్యూలో తన కుడి చేతి మణికట్టు క్రింద 'ఇర్రీప్లేసబుల్' అనే పదాన్ని ఎందుకు టాటూగా వేయించుకుందో ఇన్నాళ్లు ఒక రహస్యంగానే మిగిలిపోయింది.
కాలేజీ రోజుల్లో టాటూ అనేది బలమైన కోరిక. నేను దానిని సాధించాలనుకున్నాను. మా కాలేజీలో ఒక అబ్బాయి వచ్చి ఓహ్- అమ్మాయిలు కూడా టాటూలు వేయించుకోగలరా? అని అడిగాడు. చాలా బాధ కలిగింది. ఎందుకంటే అమ్మాయిలు సూదులు అంటే చాలా భయపడతారు.. అందుకే అతడు అలా అడిగాడు.
కానీ నేను తిరుగుబాటుదారునిగా ఉన్నందున మీకు నేనేంటో చూపిస్తాను అని కసితో రగిలిపోయాను. ఆపై నేను టాటూ వేయించుకోవాలనుకున్నాను. కానీ నాకు ఎలా వేయించుకోవాలో నిజానికి తెలియనే తెలీదు.
నాకు ఏం కావాలో స్పష్ఠంగా తెలీదు. నేను కూర్చొని ఆలోచిస్తున్నాను, ఆపై నేను నేనుగా ఉండాలనే కోరికను కలిగి ఉన్నానని గ్రహించాను. నేను ప్రతి ఒక్కరిని నమ్ముతాను. మీ శక్తిని వేరొకరి శక్తితో భర్తీ చేయలేరు. మరెవరూ మీరు కాలేరు. మీరు ఇతరులను భర్తీ చేయలేరు. మనమందరం మన సొంత మార్గాలలో వెళ్లాలి. కాబట్టి నేను టాటూను వేయించుకుని అందరికీ చూపించాలనుకున్నాను. ప్రజలకు గుర్తు చేయాలనుకున్నాను! అని సుదీర్ఘమైన క్లాస్ తీస్కుంది రష్మిక.
కెరీర్ మ్యాటర్ కి వస్తే... సిద్ధార్థ్ మల్హోత్రా సరసన మిషన్ మజ్నులో రష్మిక తదుపరి కనిపించనుంది. రష్మిక అంధ బాలికగా నటిస్తున్న స్పై థ్రిల్లర్ చిత్రం జనవరి 20 నుండి నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కానుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.