Begin typing your search above and press return to search.
ఇంతలోనే ప్రభాస్ ఆ ఈవెంట్ కి సిద్ధం?!
By: Tupaki Desk | 13 Sep 2022 2:30 AM GMTసూపర్ స్టార్ ప్రభాస్ కష్టకాలంలో ఉన్నాడు. తనని స్టార్ గా తీర్చిదిద్దిన పెదనాన్న కృష్ణంరాజు మరణం అతడికి తీరని లోటు. ప్రభాస్ కలతను ప్రత్యక్షంగా చూసిన అభిమానులు తీవ్రంగానే ఆందోళన చెందుతున్నారు. అయితే దీని నుంచి బయటపడే ఒక ఈవెంట్ ముందుందని తెలుస్తోంది.
ప్రభాస్ ఢిల్లీలోని పాపులర్ ఈవెంట్ లో పాల్గొనాల్సి ఉందని సమాచారం. దేశరాజధానిలో `రామ్ లీలా` వేడుకల్లో అతడు కనిపించనున్నారని సమాచారం. ఢిల్లీలో థియేటర్ కళాకారులు రామాయణాన్ని ప్రదర్శించే పది రోజుల సుదీర్ఘ వేడుకలు మునుముందు ఉన్నాయి. `లవ్ కుశ్ రామ్ లీలా` ఈవెంట్లో ప్రభాస్ రావణుడి దిష్టిబొమ్మను దహనం చేయనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆదిపురుష్ 3డి ప్రమోషన్స్ కి ఇంతకంటే కచ్చితమైన ప్రారంభం ఉండదు.
మునుముందు పండగ సీజన్ మరింత వేడెక్కనుంది. నవరాత్రులు 26 సెప్టెంబర్ 2022 నుండి ప్రారంభమవుతాయి. 5 అక్టోబర్ 2022 న విజయ దశమితో ముగుస్తాయి. రావణుడి దిష్టిబొమ్మను వెలిగించడంలో ప్రభాస్ ను మించిన వారు ఇంకెవరూ ఉండరని `లవ్ కుష్ రామ్ లీలా కమిటీ` నిర్వాహకులు ఓ న్యూస్ పోర్టల్ తో అన్నారు.
ఈవెంట్లో రావణుడు.. మేఘనాథ్ (ఇంద్రజిత్) కుంభకర్ణ మూడు విగ్రహాలు ఉంటాయి. శ్రీరాముడు వాటిని బాణాలు వేసి కాల్చివేస్తాడు. ఆదిపురుష్ లో ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తున్నందున అతడికి ఇది ఒక సదవకాశం. ఇది ఢిల్లీ నగరంలోని పురాతనమైన సాంస్కృతిక కార్యక్రమాల్లో ఇది ఒకటి. లవ్ కుష్ రామ్ లీలా చాందినీ చౌక్ ఐకానిక్ మార్కెట్ దగ్గర జరుగుతుంది. ప్రభాస్ కు నార్త్ లో కూడా భారీ అభిమానులు ఉన్నారు. అతడు ఈ ఈవెంట్ ముఖ్య అతిథిగా పర్ఫెక్ట్ ఛాయిస్ గా కనిపిస్తున్నారన్న టాక్ ఉంది.
ఆదిపురుష్ చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. అతని 2019 చిత్రం తాన్హాజీ - ది అన్ సంగ్ వారియర్ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 3డిలో గొప్ప సినిమాటిక్ అనుభవాన్ని ప్రేక్షకులకు ఇచ్చింది ఈ చిత్రం. ఆదిపురుష్ కూడా భారీతనం నిండిన యాక్షన్ ఫిల్మ్. ఈ సినిమా పఠాన్ కంటే ముందు 12 జనవరి 2023న రాబోతోంది. షారుఖ్ ఖాన్ పుట్టినరోజు (నవంబర్ 2) సందర్భంగా పఠాన్ అప్ డేట్ వచ్చే అవకాశం ఉన్నా కానీ... ఆదిపురుష్ మేకర్స్ ముందుగానే ప్రమోషన్స్ ని ప్రారంభిస్తున్నట్లు కనిపిస్తోంది.
డిసెంబర్ లో సిర్కస్- కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ మొదలైన పెద్ద బాలీవుడ్ విడుదలలు ఉన్నాయి కాబట్టి `ఆదిపురుష్`కి ప్రచారార్భాటం ఇప్పుడు అవసరమని టీమ్ భావిస్తోందిట.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.