Begin typing your search above and press return to search.
#MEB అమెరికాలో హాఫ్ మిలియన్ క్లబ్ లో
By: Tupaki Desk | 21 Oct 2021 4:48 AM GMTఅఖిల్ అక్కినేని -పూజా హెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` (MEB) గత శుక్రవారం విడుదలై విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 20.5 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. విడుదలైన 5 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కును దాటింది. ఎంఇబి అఖిల్ కెరీర్ ను పునరుద్ధరించడమే కాకుండా టాలీవుడ్ లో అత్యంత డిమాండ్ ఉన్న నటిగా పూజా రేంజును నిరూపించింది.
తాజా సమాచారం మేరకు... మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మరో మైలురాయిని అధిగమించాడు. ఈ చిత్రం అమెరికా లో 5 వ రోజు 28694 డాలర్లను వసూలు చేసింది. దీంతో 5 రోజుల మొత్తం 500006 (రూ. 3.74 కోట్లు) డాలర్లకు చేరుకుంది. MEB రాయల్ గా అర మిలియన్ క్లబ్ లోకి ప్రవేశించడంతో అఖిల్ యుఎస్ లో తన కెరీర్ బెస్ట్ ని అందుకున్నాడు. అమెరికా బాక్సాఫీస్ వద్ద హలో తర్వాత చక్కని ప్రజాదరణను పదిలం చేసుకున్నాడు. ఈ విజయం దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ ని మళ్లీ వెలుగులోకి తెచ్చింది. ఎంఇబికి కొన్ని తప్పులు దొర్లినా కాన్సెప్ట్ బేస్డ్ సినిమాల్లో భాస్కర్ కి గ్రిప్ ఉందని నిరూపించుకోగలిగాడని టాక్ వినిపించింది. ఇక ఎంఇబి అమెరికా బాక్సాఫీస్ వద్ద ఒక మిలియన్ డాలర్ క్లబ్ లో చేరుతుందా? అంత లాంగ్ డ్రైవ్ సాధ్యమేనా? అన్నదానికి క్లారిటీ రావాల్సి ఉంది. అఖిల్- పూజా జంట మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ.. బ్యాచిలర్ షిప్ కష్టాలపై ప్రత్యేకమైన కథాంశంతో బొమ్మరిల్లు భాస్కర్ తాజా ప్రేమ కథను తెరకెక్కించారు. మాలీవుడ్ కంపోజర్ గోపి సుందర్ చక్కని సంగీతం కూడా ప్లస్ అయ్యింది. బన్నీ వాస్ - వాసువర్మ సంయుక్త నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసినదే.
`ఏజెంట్` గా మరోసారి సత్తా చాటుతాడా?
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విజయంతో అఖిల్ పై పాజిటివ్ వైబ్స్ మొదలైనట్టే. ఇది ఏజెంట్ కి కలిసి రానుంది. గూఢచర్యం నేపథ్యంలో సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని అత్యంత స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా మలుస్తున్నారని సమాచారం. స్పై సినిమా అంటే కథాంశంలో కచ్ఛితంగా యూనివర్శల్ అప్పీల్ ఉంటుంది. విజువల్ గ్రాండియారిటీతో ఈ తరహా స్పై సినిమాలు అలరిస్తాయి. భారీతనం యాక్షన్ ఛేజ్ లతో.. హాలీవుడ్ లో జేమ్స్ బాండ్ 007 - బార్న్ ఐడెంటిటీ రేంజులో ఉంటుందని అంచనా వేస్తున్నారు.
అఖిల్ కథానాయకుడిగా నటిస్తున్న ఏజెంట్ పై అందరి కళ్లు పడ్డాయి ఇప్పటికే. రేసుగుర్రం- సైరా లాంటి సినిమాల్ని తెరకెక్కించిన సురేందర్ రెడ్డిపై అందరికీ నమ్మకం ఉంది. ఈ మూవీ కోసం అఖిల్ లుక్ ని అతడు అమాంతం మార్చేసాడు. ఈ సినిమాని తెలుగు-తమిళ భాషల్ని టార్గెట్ చేస్తూ రూపొందిస్తున్నారని సమాచారం. ఏజెంట్ లో అఖిల్ లుక్ ఇప్పటికే సినిమాకి కావాల్సినంత ప్రచారాన్ని తెచ్చి పెట్టింది. సిక్స్ ప్యాక్ లో అఖిల్ లుక్ ఆకట్టుకుంది. ఇదొక స్పై థ్రిల్లర్ అని ఇప్పటికే ప్రచారంలో ఉంది. వైజాగ్ పోర్టులో వెలుగు చూసిన హానీట్రాప్ నేపథ్యం ఎంచుకున్నారని మరోవైపు జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ సినిమా మొదటి షెడ్యూల్ నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టులోనే జరిగింది. ఇక ఇటీవలే మరో షెడ్యూల్ వైజాగ్ పోర్టులోనూ చిత్రీకరణ పూర్తయింది. షూట్ లో భాగంగా ఏజెంట్ టీమ్ విశాఖ కోస్టల్ బెల్ట్ మొత్తం చుట్టేసిన సంగతి తెలిసిందే. ఇటీవల హైదరాబాద్ లోనూ కొంత షూటింగ్ చేసారు. తాజాగా యూనిట్ విదేశాల్లో చిత్రీకరణ సాగుతోంది. ప్రస్తుతం షూటింగ్ బుడాఫెస్ట్ లోనూ జరుగుతుందని సమాచారం. అక్కడి షెడ్యూల్ పూర్తి చేసిన అనంతరం యూనిట్ తిరుగు ప్రయాణమవుతుంది. అక్కడ నుంచి యథావిధిగా హైదరాబాద్ లో బ్యాలెన్స్ షూటింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా కోసం 40కోట్లకు పైగానే వెచ్చించినట్లు సమాచారం.