Begin typing your search above and press return to search.
తప్పుడు ప్రచారమైనా గాంధీ హ్యాపీనే
By: Tupaki Desk | 25 Aug 2017 6:30 AM GMTమహాత్మా గాంధీ ముని మనవరాలు మేధా గాంధీ సడెన్ గా న్యూస్ లోకి వచ్చేసింది. తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసిన కొన్ని ఫోటోలను బేస్ చేసుకుని.. ఈమె ఇంటర్నెల్ లో హాట్ స్టార్ అంటూ ప్రచారం జరిగిపోతోంది. కాంతీలాల్ గాంధీ కూతురు అయిన మేధా గాంధీ.. రాజకీయాలకు మాత్రమే కాదు.. ఇండియాకే దూరంగా తన తల్లిదండ్రులతో పాటు అమెరికాలో ఉంటోంది. అక్కడ డీజేగా పని చేస్తున్న ఈమె.. ఆ కల్చర్ ప్రకారమే నడుచుకుంటోందని చెప్పచ్చు.
అయితే.. బాలీవుడ్ నుంచి మొదలుకుని తెలుగు మీడియా వరకూ సడెన్ గా ఆమెను హాట్ స్టార్ చేసేస్తూ కథనాలు వడ్డించేశాయి. సెక్సీ లుక్స్ లో గాంధీ వారసురాలు అనే పాయింట్ ను హైలైట్ చేస్తూ తెగ వర్ణించేశారు. ఈ విషయంపై కూడా తన స్టైల్ లోనే రియాక్ట్ అయింది మేధా గాంధీ. "మామా.. నేను బాలీవుడ్ వార్తల్లోకి ఎక్కాను. ఆ ఆర్టికల్సో సగానికి పైగా ఏమాత్రం బాలేవు. పైగా వాటిలో చాలా వరకు అన్నీ అవాస్తవాలే. అయినా సరే నేను దీన్ని విజయంగానే భావిస్తాను. ఎందుకంటే.. నేను నిజాలు కానివాటిని పెద్దగా నమ్మను.. పట్టించుకోను" అని చెప్పింది మేధా గాంధీ.
అయినా.. ఈమె ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ చూస్తే.. 57 వేల మంది ఫాలోయర్స్ ఉంటారు. లండన్ లో జాకీగా ఫేమస్ కాబట్టి ఈ మాత్రమైనా ఫాలో చేస్తున్నారు. కానీ ఇంత మాత్రానికే ఈమెను ఇంటర్నెట్ స్టార్ ను చేసేసిన మీడియాను ఎలా అర్ధం చేసుకోవాలో అర్ధం కాని పరిస్థితి. బహుశా తను కోరుకున్న అటెన్షన్ దక్కబట్టే.. ఇలాంటి కామెంట్ ను మేధా గాంధీ చేసి ఉంటుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.