Begin typing your search above and press return to search.
మనలో ఒకడుకు షాకిచ్చిన మీడియా
By: Tupaki Desk | 2 Nov 2016 5:30 PM GMTఏది ఏమైనా.. ఎవరు ఎంత చెప్పినా.. మీడియా ప్రభావం జనాల మీద ఉందన్నది నిజం. గడిచిన కొన్నేళ్లుగా మీడియా తన విశ్వసనీయతను చాలా ఎక్కువగా పోగొట్టుకున్నదన్నది చేదు నిజమని చెప్పక తప్పదు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన మీడియా చేసే తప్పులకు చాలామంది బలి అవుతుంటారు. అలాంటి కొన్ని తప్పుల్ని ఎత్తి చూపిస్తూ.. మీడియా మీద సటైర్లు వేస్తూ ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయిక్ ‘‘మనలో ఒకడు’’ చిత్రాన్ని రూపొందించారు.
ఈ సినిమా మీద చాలానే ఆశలు పెట్టుకున్న ఆర్పీ.. తన చిత్రం విడుదలయ్యాక.. మీడియా తీరుపై ఆసక్తికర చర్చ జరగటం ఖాయమన్న నమ్మకం ఆయన మాటల్లో వినిపిస్తుంది. ఇదిలా ఉంటే..మీడియా మీద సునిశిత విమర్శలతో.. ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయని సబ్జెక్ట్ తో రూపొందించినట్లుగా చెబుతున్న ఈ సినిమాకు కొన్ని ‘మీడియాసంస్థలు’ ఇచ్చిన షాక్ తో ఆర్పీ అండ్ టీం దిమ్మ తిరిగిపోయిందని చెబుతున్నారు.
అదెలానంటే.. మనలో ఒకడు సినిమాను ఈ నెల 4న విడుదల చేయాలని డిసైడ్ చేశారు. దీనికి తగ్గట్లే పబ్లిసిటీ స్టార్ట్ చేశారు. అయితే.. కొన్ని అగ్రపత్రికల్లో ఆయన ఇంటర్వ్యూ పబ్లిష్ కావటమే కాదు.. ఆయన సినిమా ఈ నెల 11న విడుదల కానున్నట్లుగా ప్రచురించారు. దీంతో.. ఇంటర్వ్యూలోని అంశాన్ని నమ్మాలా? లేక.. పబ్లిసిటీని నమ్మాలా? అన్న కన్ఫ్యూజన్ మొదలైంది. సినిమా విడుదలకు కేవలం రెండు రోజులముందు ఇలాంటి కన్ఫ్యూజన్ తలెత్తటం.. అది కూడా అగ్రశ్రేణి పత్రికలు కొన్ని కారణం కావటంపై ఆర్పీ అండ్ టీం తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. మీడియా మీద ఆర్పీ సటైర్ సంగతేమో కానీ.. కొన్ని మీడియా సంస్థల్లో ఆయన సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ తప్పుగా ప్రచురితం కావటం ఆర్పీ టీంకు షాకింగ్ గా మారిందనటంలో సందేహం లేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/