Begin typing your search above and press return to search.
2 కోట్లతో 'సాహో' ఛేజింగ్ వరల్డ్
By: Tupaki Desk | 16 Aug 2019 12:01 PM GMT ప్రభాస్-సుజీత్ -యువి క్రియేషన్స్ బృందం `సాహో` ప్రమోషన్స్ ని వేడెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అన్ని మెట్రోల్లోనూ ప్రచార కార్యక్రమాలకు డిజైన్ చేశారు. అయితే తమిళ వెర్షన్ ప్రచారంలో చిన్నపాటి ఇబ్బంది గురించి తాజాగా ఆసక్తికర సమాచారం అందింది. అక్కడ గత కొంతకాలంగా కోలీవుడ్ మీడియాకి నిర్మాతలకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తమిళ నిర్మాతలపై మీడియా గరంగరంగా ఉంది. దాదాపు 250-300 మంది మీడియా ప్రతినిధులు ప్రతిసారీ ప్రెస్ మీట్ లో దర్శనమిస్తున్నారని.. వీళ్ల కోసం అదనపు బడ్జెట్ కేటాయించాల్సి వస్తోందని ఇప్పటికే తమిళ నిర్మాతల సంఘం `కవర్` కల్చర్ కి చెక్ పెట్టేసింది. దీంతో నాటి నుంచి నిర్మాతలతో జర్నలిస్టులకు చెడింది. అయితే దాని పర్యవసానం చచ్చీ చెడీ టాలీవుడ్ ప్రెస్టేజియస్ మూవీ `సాహో`పైనా పడిందట. సాహో రిలీజ్ కి ఎలాంటి ఇబ్బందీ లేకపోయినా... కోలీవుడ్ మీడియా లొల్లు కొంతవరకూ చిక్కులు తెచ్చి పెట్టిందని తెలుస్తోంది.
ఆగస్టు 30న `సాహో` ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రిలీజవుతోంది. తమిళనాడులోనూ అత్యంత భారీగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తమిళ వెర్షన్ ప్రచారం పరంగా చిక్కులు వచ్చి పడ్డాయట. మీడియాతో సరిగా సఖ్యత కుదరకపోవడంతో తమిళ వెర్షన్ నిర్మాతలు ఆ పరిస్థితి నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. మీడియాతో చెడకుండా జాగ్రత్తలు పాటిస్తూ.. విడివిడిగా ప్రెస్ మీట్లు పెట్టుకోవాల్సి వస్తోందట. దానికి కోలీవుడ్ మీడియా ఏ మేరకు సహకరిస్తోంది అన్నది తెలియాల్సి ఉంది. అయితే సాహో విషయంలో ఈ వ్యవహారం చూస్తుంటే ఎంకి చావు సుబ్బొకొచ్చినట్టే ఉందన్న వ్యాఖ్యలు తాజాగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సాహో యూనిట్ చెన్నయ్ ప్రచారంలో బిజీబిజీగా ఉంది. మద్రాస్ హయత్ లో పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేశారు. కానీ వీళ్లకు అక్కడ మీడియాతో చిన్నపాటి సమస్యలు ఎదురవుతున్నాయట.
ఇకపోతే హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో ఈనెల 18న సాహో యూనిట్ భారీ ఈవెంట్ కి ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకకు లక్ష మంది ప్రభాస్ ఫ్యాన్స్ దూసుకొస్తున్నారన్న ప్రచారం ఉంది. రూ.2 కోట్ల ఖర్చుతో ఏకంగా సాహో వరల్డ్ పేరుతో ఈ సినిమాలో ఉపయోగించిన ప్రత్యేక వాహనాల డిస్ ప్లే ఉంటుందట. దుబాయ్ ఛేజ్ లలో ఉపయోగించిన ఖరీదైన కార్.. రేసింగ్ బైక్ సహా పలు వాహనాల్ని ప్రదర్శిస్తున్నారట. రామోజీ ఫిల్మ్ సిటీ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కి ఇదే స్పెషల్ ఆకర్షణ అని తెలుస్తోంది. దీని కోసం ఒక ప్రత్యేకమైన సెట్ ని డిజైన్ చేస్తున్నారట. ఫంక్షన్ అయ్యాక కూడా ఈ సెట్ ఇలానే ఉంటుందని తెలుస్తోంది. మొత్తానికి సాహో ప్రచారం రకరకాల కోణాల్లో వేడెక్కిపోతోందన్నమాట