Begin typing your search above and press return to search.
మీడియా టార్గెట్ చేస్తోంది - జీవితా రాజశేఖర్
By: Tupaki Desk | 23 April 2022 9:40 AM GMTహీరో రాజశేఖర్ పై జోస్టార్ ఫిల్మ్ సర్వీసెస్ అధినేత కోటేశ్వరరావు ఇటీవల సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తనకు 26 కోట్లు జీవితా రాజశేఖర్ దంపతులు ఎగవేశారని, వారిని జైలుకు పంపిస్తానని సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఈ వివాదం ఇండస్ట్రీలో హాట్ చర్చకు దారితీసింది. దీనిపై వివరణ ఇవ్వడానికి శనివారం జీవిత రాజశేఖర్ మీడియా ముందుకొచ్చారు. డా. రాజశేఖర్ హీరోగా నటిస్తున్న చిత్రం 'శేఖర్'. మలయాళ హిట్ చిత్రం 'జోసెఫ్' మూవీ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని మే 20న విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా రిలీజ్ డేట్ ని శనివారం ప్రకటించిన జీవితా రాజశేఖర్ తమపై జోస్టార్ ఫిల్మ్ సర్వీసెస్ అధినేత కోటేశ్వరరావు చేసిన సంచలన ఆరోపణలపై స్పందించారు. 'శేఖర్' సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని, ఈ చిత్రాన్ని మే20న విడుదల చేస్తున్నామని, గత కొంత కాలంగా థివయేటర్లకు రాని ప్రేక్షకులు ఇప్పుడు జాతరగా వస్తుండటం చూసి ఆనందంగా వుందని, ఈ నేపథ్యంలో మా చిత్రాన్ని కూడా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నామని జీవిత అన్నారు.
ఇక తాజా ఆరోపణలపై స్పందించిన ఆమె 'మాపై వచ్చిన ఆరోపణల్లోనే క్లారిటీ వుంది. నగరి కోర్టులో ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోంది. మాపై వారెంట్ ఇష్యూ అయింది. నేను ఎక్కడికి పారిపోలేదు. అరెస్ట్ కాలేదు. వారెంట్ వచ్చిందన్నది అందరూ చూశారు. అది నిజమే దానిపై మా లీగల్ టీమ్ ప్రొసీడ్ అవుతోంది. సమన్లు మాకు అందలేదు.. అందకుండా చేశారు. మాపై అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయిన సమయంలో నేను కోవిడ్ తో సఫర్ కావడం వల్ల మా లాయర్ సంబంధించిన డాక్యుమెంట్స్ తో కోర్టులో హాజరయ్యారు. దానికి సంబంధించిన విచారణ జరుగుతోంది.
దాని వెనక ఏం జరిగిందన్నది తీర్పు వచ్చాక అందరికి తెలుస్తుంది. ఇందులో జీవిత మోసం చేసిందా? వఆరు మోసం చేశారా? జోస్టార్ ఫిల్మ్ సర్వీసెస్ అధినేత కోటేశ్వరరావు గారు ఎందుకొచ్చారు? అయన మీద ఇక్కడ కేసు ఎందుకు వుంది? ఆయన వల్ల మా మేనేజర్లు ఎంత సఫర్ అవుతున్నారు? ఇవన్నీ కూడా రేపు కోర్టులో బయటపడతాయి. నగరి కోర్టులో వారెంట్ ఇష్యూ అయి రెండు నెలలవుతోంది. రెండు నెలల తరువాత వాళ్లు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటంలో వున్న ఆంతర్యం ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఒక వేళ మమ్మల్ని డీ ఫ్రేమ్ చెయ్యాలనో లేక నన్ను డీమోరలైజ్ చేయాలనో అనుకుంటే అది ఎవరి తరం కాదు. మేము తప్పు చేసిన రోజు తప్పుచేశాం అని ఒప్పుకునే ధైర్యం వుంది. అలాగే చేయని రోజు చేయలేదని ఆ భగవంతుడి ముందు చెప్పడానికి అంతే ధైర్యం వుంది. ఎలాంటి పరిస్థితుల్ని అయినా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా వున్నాం.
ఈ సందర్భంగా ఒకటి మాత్రం చెప్పాలనుకుంటున్నాను. థంబ్ నేయిల్స్ వల్ల చాలా ఇబ్బందిపడుతున్నాం. ఇటీవల మా డాటర్స్ గురించి కూడా తప్పుడు థంబ్ నేయిల్స్ తో ప్రచారం చేశారు. ఎందుకు ప్రతీ ఇష్యూకు మమ్మల్ని లాగుతున్నారు? 'మా' ఎలక్షన్స్ అంటే మేమే హెడ్ లైన్స్ లో వుంటున్నాం. గతంలో నాపై కేసు వేసిన వారు ఓడిపోయారు దాంతో నేను వాళ్లకి డబ్బులు ఇవ్వాల్సిన పనిలుదని ప్రూవ్ అయింది. జోస్టార్ ఫిల్మ్ సర్వీసెస్ అధినేత కోటేశ్వరరావు 26 కోట్లన్నారు.. అయిన కోట్లన్నారా? లేక వేసుకునే కోట్లన్నారో నాకు అర్థం కాలేదు.
నిజంగా మేము దుర్మార్గులం అయితే 30 ఏళ్లు ఈ ఇండస్ట్రీలో ఎలా వుండేవాళ్లం. రేపు మా పిల్లలు కూడా పెళ్లిళ్లు చేసుకుని మంచి ఇంటికి వెళ్లాలి కదా? ..జోస్టార్ ఫిల్మ్ సర్వీసెస్ అధినేత కోటేశ్వరరావు ఓవర్ యాంబీషియస్ కావడం కానీ లేదా ఆయన ఎవరెవరో వద్ద తీసుకున్న అప్పులు అన్నీ మామీద రుద్దడానికి కావచ్చు.. ఆయన ఆరోపణల వెనకున్న ఇంటెన్షన్ ఏంటో మాకు అర్థం కావడం లేదు. 'గరుడవేగ' సినిమాకు జోస్టార్ ఫిల్మ్ సర్వీసెస్ అధినేత కోటేశ్వరరావు నిర్మాత. దీనికి సంబంధించి ఇక్కడ ఎవరూ ఏమీ దాయలేదు అది అందరికి తెలిసిందే' అని చెప్పుకొచ్చారు జీవితా రాజశేఖర్.