Begin typing your search above and press return to search.

మీడియా డ్యాన్స్ మామూలుగా లేదంతే

By:  Tupaki Desk   |   11 April 2018 7:13 AM GMT
మీడియా డ్యాన్స్ మామూలుగా లేదంతే
X
ఏ భాష‌లోనూ లేన‌న్ని న్యూస్ ఛానెళ్లు మ‌న‌ద‌గ్గ‌రే ఉన్నాయి. దాంతో ఒక్క చిన్న ఇష్యూ అయినా స‌రే... దాన్ని హైలెట్ చేస్తూ మ‌ళ్లీ మ‌ళ్లీ టెలికాస్ట్ చేస్తుంటాయి తెలుగు న్యూస్ ఛానెళ్లు. అయితే ఏ ఎండ‌కి ఆ గొడుకు ప‌ట్ట‌డం అనేది చాలా ఛానెళ్లు వ్య‌వ‌హ‌రించే విధానం. త‌మ‌కు అనుకూలంగా వ్య‌వ‌హరించే వారి ప‌ట్ల సానుకూలంగా స్పందిస్తూ... కొద్దిగా తేడా వ‌చ్చినా ఉతికి ఆరేయ‌డం అనేది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే.

ఎప్పుడూ ఏదో ఓ సంచ‌ల‌నం కోసం ఎదురుచూసే మీడియాకి ఇప్పుడు శ్రీ‌రెడ్డి ఉదంతం ఓ హాట్ కేక్‌లా దొరికింది. ఎటువంటి సెన్సార్ లేకుండా బూతులు మాట్లాడుతుండ‌డంతో ఒక్క‌సారిగా పిచ్చ పాపులారిటీ వ‌చ్చేసింది శ్రీ‌రెడ్డికి. అంతే న్యూస్ ఛానెళ్ల‌న్నీ ఇంట‌ర్య్వూల కోసం ఆమె వెంట ప‌డ్డాయి. దాంతో క్రేజ్ వ‌చ్చిన శ్రీ‌రెడ్డి... నిర్భయంగా ఒక్కోక్క‌రి పేర్లు... వారితో స‌న్నిహితంగా ఆమె దిగిన ఫోటోలు బ‌య‌ట‌పెట్ట‌డం మొద‌లుపెట్టింది. కానీ చాలా ఛానెళ్లు ఆమె మాట‌ల‌ను బ‌య‌ట‌పెడుతున్నాయి కానీ ఆమె ఆరోపించే బ‌డా బ‌డా వ్య‌క్తుల పేర్లును... వారికి సంబంధించిన ఫోటోల‌ను చూపిన‌ప్పుడు మాత్రం ముసుగు వేస్తున్నాయి. మామూలుగా అయితే ఇలాంటి స్కాండిల్స్‌లో పవర్ లేని రాజకీయ నాయ‌కులు- సాధార‌ణ వ్య‌క్తులు- చిన్నా చిత‌కా హాస్య న‌టులు దొరికితే మాత్రం వేసిన ఫోటోల‌ను వేసి వేసి... మ‌రీ విసిగించేస్తాయి ఇవే న్యూస్ ఛానెళ్లు. స‌దరు వ్య‌క్తి ప‌రువు మొత్తం ఉతికి పారేస్తాయి. ఇప్పుడు మాత్రం సెన్సార్ పాటిస్తున్నాయి. ఎందుకంటారు?

ఇప్పుడు ఈ ఇష్యూలో లింకైన వ్య‌క్తులు టాలీవుడ్ ప్ర‌ముఖులు- వారి సుపుత్రులు. దాంతో ఎక్క‌డ తేడా వ‌చ్చినా యాడ్స్ రావు. ఆదాయం త‌గ్గుతుంది. అందుకే ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ గా ఆలోచిస్తూ చూసే జ‌నాల‌ను వెర్రివాళ్ల‌ను చేస్తున్నాయి న్యూస్ ఛానెళ్లు అంటున్నారు విశ్లేషకులు. ఒకవేళ టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్లు అందరూ మూకుమ్మడిగా నిర్ణయం తీసుకుని.. యాడ్స్ ఇవ్వం అంటే చేసేదేం లేదు. అందుకే అందరూ సైలెంట్ అయిపోయారు అంటున్నారు.

అయితే జ‌నాద‌ర‌ణ లేని కొన్ని ఛానెళ్లు ఎటువంటి సెన్సార్ లేకుండా వ్య‌క్తుల ఫోటోల‌ను ప్ర‌సారం చేయ‌డంతో ఒక్క‌సారిగా మిగిలిన ఛానెళ్లు కూడా ఇదే బాట ప‌ట్ట‌బోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు యాడ్స్ కంటే టిఆర్పీలు ముఖ్యం కాబట్టి. దీన్నే డ్యాన్స్ ఆఫ్‌ మీడియా అంటారు.