Begin typing your search above and press return to search.
ప్రకాష్ రాజ్ ను ఉక్కిరిబిక్కిరి చేసిన మీడియా ప్రతినిధులు
By: Tupaki Desk | 26 Jun 2021 4:30 AM GMTవిషయం ఏదైనా సరే.. మీడియా మీద పడటం ఈ మధ్యన అన్ని స్థాయిల్లోని వారికి ఒక అలవాటుగా మారింది. ముందు తమ తప్పుల్ని తరచి చూసుకోవాల్సింది పోయి.. మీడియాను విమర్శించటం ఒక పనిగా పెట్టుకోవటం ఎక్కువైంది. అన్ని వర్గాల వారిలో లోపాలు ఉన్నట్లే.. మీడియాలోనూ కొన్ని లోపాలు ఉండొచ్చు. కానీ.. మీడియా తనకు తానుగా ఏ ఇష్యూను కెలకదు. అల్రెడీ ఎవరో ఒకరు కెలికిన ఇష్యూస్ ను మీడియా టేకప్ చేస్తుంది.
ఈ క్రమంలో కొందరు అత్యుత్సాహాన్ని ప్రదర్శించొచ్చు. కానీ.. దీనంతటికి కారణం ఆయా వర్గాలే తప్పించి మీడియా కాదన్నది మర్చిపోకూడదు. కానీ.. అదేమీ లేకుండా మీడియా మీద అవాకులు చవాకులు పేలటం ఈ మధ్యన ఫ్యాషన్ గా మారింది. తాజాగా ‘మా’ ఎన్నికల ఎపిసోడ్ లో తనకు తానుగా ఎన్నికల రేసులో నిలిచిన విషయాన్ని ప్రకటించిన తర్వాతే ఈ ఇష్యూ మీద పెద్ద ఎత్తున ఆసక్తి వ్యక్తమైంది.
అధ్యక్ష స్థానానికి తాను పోటీ పడనున్నట్లుగా ప్రకాశ్ రాజ్ నోటి నుంచి మాట వచ్చినంతనే.. వరుస పెట్టి మరో ముగ్గురు (మంచు విష్ణు.. జీవిత.. హేమ) ఆశావాహులు తాము పోటీలో ఉన్నట్లుగా ప్రకటించి వాతావరణాన్ని వేడెక్కించారు. ఈ నేపథ్యంలో మీడియా తాను చేయాల్సింది చేసింది. ఈ క్రమంలో ప్రెస్ మీట్ పెట్టిన ప్రకాశ్ రాజ్ అండ్ టీ.. ‘మా’ ఎన్నికల్లో తామేం చేయనున్న విషయాన్ని వెల్లడించారు. ఈ క్రమంలో మీడియా మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేసేలా ప్రకాశ్ రాజ్ మాట్లాడారు.
ఈ సందర్భంగా పలు నిందలు వేశారు. తాను మాట్లాడిందంతా మాట్లాడిన తర్వాత ప్రశ్నలు వేసేందుకు మీడియా ప్రతినిధులకు అవకాశం ఇచ్చారు. దీంతో ప్రశ్నల మీద ప్రశ్నలు వేయటమే కాదు.. ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మొదట్లో కూల్ గా బదులు ఇచ్చిన ప్రకాష్ రాజ్.. ఒక దశలో కూసింత బ్యాలెన్స్ మిస్ అవుతున్నట్లు కనిపించారు.
ఆ విషయాన్ని గ్రహించిన బండ్ల గణేశ్ వెంటనే ప్రకాశ్ రాజ్ చేతిలోని మైక్ తీసుకొని.. ఇష్యూను సెటిల్ చేసే ప్రయత్నం చేశారు. మీడియా ప్రతినిధుల అభ్యంతరాల వేడిని చల్లార్చే ప్రయత్నం చేశారు. మొత్తంగా మీడియా ప్రతినిధుల పుణ్యమా అని ప్రకాశ్ రాజ్ ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మీరు ఏమంటే అది పడే పరిస్థితుల్లో తాము లేమన్న విషయాన్ని పదునైన ప్రశ్నలతో స్పష్టం చేశారని చెప్పక తప్పదు.