Begin typing your search above and press return to search.
బాహుబలి.. బాలీవుడ్‌కు పాఠాలు నేర్పిస్తోంది
By: Tupaki Desk | 29 Jun 2015 11:30 AM GMTబాలీవుడ్ వాళ్లు ఓ సినిమాకు వంద కోట్ల బడ్జెట్ పెట్టారంటే.. అందులో మొత్తం సినిమాకే ఖర్చుపెట్టరు. ఓ 80 కోట్లలో సినిమా పూర్తి చేసి.. ఇంకో 20 కోట్లు పబ్లిసిటీ కోసం ఖర్చు పెడతారు. సినిమా ఫస్ట్‌లుక్ టీజర్ దగ్గర్నుంచి సినిమాను ఓ రేంజిలో ప్రమోట్ చేస్తారు. విడుదలకు ముందైతే భారీ పబ్లిసిటీ ప్లాన్ ఉంటుంది. ఏ ఛానెల్లో చూసినా తమ సినిమా ట్రైలరే కనిపించేలా భారీగా ఖర్చుబెట్టి పబ్లిసిటీ చేస్తారు. వెబ్ మీడియాలో కూడా పబ్లిసిటీ అదే స్థాయిలో ఉంటుంది. టాలీవుడ్ జనాలు ఆ స్థాయిలో కాకపోయినా పబ్లిసిటీ కోసం బాగానే ఖర్చుపెడుతుంటారు. క్రేజ్ ఉన్న సినిమాలకు ఖర్చు లేకుండా ఎంత ప్రచారం వచ్చినా.. విడుదల దగ్గర పడ్డప్పుడైనా మీడియాకు ప్రకటనలివ్వడం మామూలే.
కానీ 'బాహుబలి' టీమ్ రూటే వేరు. ఇప్పటిదాకా పబ్లిసిటీ మీద ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు బాహుబలి టీమ్. ప్రింట్, ఎలక్ట్రానిక్, వెబ్ మీడియాకు తోడు.. సోషల్ మీడియా ఈ సినిమాను నెత్తిన పెట్టుకుని ఉచిత ప్రచారం కల్పిస్తోంది. మేకింగ్ వీడియోలు రిలీజ్ చేసినప్పటి నుంచి మొన్నటి ఆడియో ఫంక్షన్ వరకు బాహుబలికి సంబంధించి ప్రతి అంశానికీ అన్ని రకాల మీడియా విస్తృతమైన ప్రచారం కల్పిస్తోంది. ఇప్పటిదాకా టీవీల్లో కానీ.. పత్రికల్లో కానీ.. బాహుబలికి సంబంధించి ఒక్క యాడ్ కూడా లేదు. ఇన్నాళ్లూ అయితే ఓకే కానీ.. ఇప్పుడింకో పది రోజుల్లో బాహుబలి సినిమా రిలీజవబోతున్నా కూడా.. ఎక్కడా యాడ్స్ లేవు. విడుదలకు ముందు రోజు కూడా పత్రికల్లో యాడ్ వస్తుందని ఎవరూ అనుకోవట్లేదు.
మొదట్నుంచి బాహుబలి టీమ్ సోషల్ మీడియాను భలేగా వాడుకుంటూ సినిమాను ప్రమోట్ చేస్తుంటే.. మిగతా అన్ని మీడియాలూ ప్రతి విశేషాన్నీ కవర్ చేస్తున్నాయి. ఐతే మీడియా కూడా 'బాహుబలి'ని ఊరికే ఎత్తుకోవట్లేదు. ఆ సినిమాకు అంత కెపాసిటీ ఉంది మరి. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో తెరకెక్కిన మన సినిమాను ప్రమోట్ చేయడం బాధ్యతగా భావిస్తుండొచ్చు లేదంటే బాహుబలి విశేషాల్ని కవర్ చేయకుంటే మనం వెనకబడిపోతామని అనుకుంటుండొచ్చు. ఏదేమైనా ఓ సినిమాను పైసా ఖర్చు లేకుండా ఎలా ప్రమోట్ చేసుకోవాలో బాహుబలి టీమ్ చూపించింది. ఈ విషయంలో బాలీవుడ్ వాళ్లు కూడా 'బాహుబలి'ని చూసి పాఠాలు నేర్చుకోవాల్సిందే.