Begin typing your search above and press return to search.

చైతన్య రాక కోసం మీడియా ఎదురు చూపులు

By:  Tupaki Desk   |   13 Sep 2021 4:30 AM GMT
చైతన్య రాక కోసం మీడియా ఎదురు చూపులు
X
అక్కినేని నాగచైతన్య నటించిన 'లవ్‌ స్టోరీ' విడుదలకు సిద్దం అయ్యింది. కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చిన ఈ సినిమా వచ్చే వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నాగచైతన్య కు జోడీగా సాయి పల్లవి నటించడం వల్ల అంచనాలు మరింతగా పెరిగాయి. ఫిదా కాంబో మూవీ అవ్వడంతో లవ్‌ స్టోరీ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అనే నమ్మకం అందరిలో ఉంది. చాలా నాచురల్ మరియు క్యూట్‌ లవ్‌ స్టోరీ మరియు సన్నివేశాలతో సినిమా సాగుతుందని పాటలు మరియు టీజర్ చూస్తే అనిపిస్తుంది. భారీ ఎత్తున అంచనాలున్న లవ్ స్టోరీ సినిమా విడుదల నేపథ్యంలో చైతూ ప్రమోషన్స్ కు మీడియా ముందుకు రాబోతున్నాడు. చైతూ ఎప్పుడెప్పుడు మీడియా ముందుకు వస్తాడా అంటూ అంతా ఎదురు చూస్తున్నారు.

నాగచైతన్య మరియు సమంతల మద్య ఏం జరుగుతుంది అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమె తన పేరు ముందు అక్కినేని తొలగించడంతో పాటు ఈమద్య కాలంలో చైతూతో కనిపించలేదు. అక్కినేని వారి ఫ్యామిలీ వేడుకలో కూడా ఆమె కనిపించలేదు. కనుక అనుమానాలు పెరుగుతున్నాయి. దాంతో నాగచైతన్య లేదా సమంతలు మీడియా ముందుకు వచ్చిన సమయంలో క్లారిటీ తీసుకోవాలని సినీ జర్నలిస్ట్‌ లు ఎదురు చూస్తున్నారు. పలు కారణాల వల్ల ఇద్దరు కూడా ఇన్ని రోజులుగా మీడియా ముందుకు రాలేదు. ఎట్టకేలకు నాగచైతన్య తన లవ్‌ స్టోరీ సినిమా ప్రమోషన్స్ కోసం మీడియా ముందుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనుక ఖచ్చితంగా ఆయన్ను ఈ ప్రశ్న ఫిల్మ్‌ జర్నలిస్ట్ లు అడిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సమంత పేరు మార్పు గురించి ఖచ్చితంగా చైతూ ప్రశ్న ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతే కాకుండా ఎందుకు ఈమద్య కాలంలో సమంత మీరు కలిసి కనిపించడం లేదు అంటూ సోషల్ మీడియాలో అంటున్నారు.. దీనికి మీ సమాధానం ఏంటీ అంటూ ప్రశ్నించే అవకాశం ఉంది. మరి ఈ ప్రశ్నలకు చైతూ ఏం సమాధానం చెప్తాడా చూడాలి. ఈ వీకెండ్‌ నుండి చైతూ లవ్‌ స్టోరీ ప్రమోషన్స్ ను మొదలు పెట్టే అవకాశం ఉంది. లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ వేడుకను వచ్చే వారంలో నిర్వహిస్తారా లేదా ఈ ఆదివారమే చేస్తారా అనేది ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి నాగచైతన్య మీడియా ముందుకు ఎప్పుడు వస్తాడు.. ఎప్పుడు ఆయన్ను సమంత విషయం అడిగేయాలి అని మీడియా మిత్రులు వెయిట్‌ చేస్తున్నారు. అక్కినేని అభిమానులు కూడా ఈ విషయమై క్లారిటీ కోసం ఎదురు చూస్తున్నారు. కనుక చైతూ తామిద్దరం బాగున్నాం.. అంతా బాగానే ఉందని చేప్తాడని ఆశిద్దాం.