Begin typing your search above and press return to search.
మైత్రికి కలిసిరాని మీడియం హీరోలు?
By: Tupaki Desk | 29 July 2019 5:06 AM GMTఇండస్ట్రీలో అడుగు పెట్టిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోలతో వరసగా మూడు ఇండస్ట్రీ హిట్స్ సాధించి అగ్ర నిర్మాణ సంస్థలే నోరెళ్ళబెట్టేలా చేసుకున్న మైత్రి మూవీ మేకర్స్ కు హ్యాట్రిక్ పూర్తవ్వడం ఆలస్యం ఫ్లాపుల పరంపర కొనసాగుతోంది. శ్రీమంతుడు- జనతా గ్యారేజ్ - రంగస్థలం తర్వాత ఊహించని విధంగా మైత్రిని పరాజయాలు వెంటాడుతున్నాయి. ఇక్కడ గమనించాల్సిన అంశం మరొకటి ఉంది. రామ్ చరణ్ తో బ్లాక్ బస్టర్ కొట్టాక మైత్రి చేసినవన్నీ మీడియం రేంజ్ హీరోలవే.
నాగ చైతన్య సవ్యసాచి మొదటి దెబ్బ వేయగా రవితేజతో భారీగా వ్యయంతో తీసిన అమర్ అక్బర్ ఆంటోనీ ఏకంగా బ్రాండ్ కే ఎసరు పెట్టింది. సరే ఇలాంటివి ఏ నిర్మాతకైనా సహజం కాబట్టి తప్పదు అనుకుంటే ఇప్పుడు విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ సైతం అదే దారిలో వెళ్లడం పట్ల నిర్మాతల్లో ఆందోళన వ్యక్తం కావడంలో ఆశ్చర్యం లేదు. ప్రస్తుతం స్టార్ హీరోలు ఇతర ప్రాజెక్టులతో బిజీ కావడం మూలాన మైత్రి మీడియం రేంజ్ హీరోలతో సర్దుకుపోతోంది.నిర్మాణంలో ఉన్న ఉప్పెనలో డెబ్యూ చేస్తున్నాడు వైష్ణవ్ తేజ్.
ఇది కాకుండా సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా ఉంది కానీ ఇంకా స్క్రిప్ట్ లాక్ కాలేదు. వచ్చే ఏడాది ప్రారంభంలో తప్ప సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ లేదు. ఇది చాలదు అన్నట్టు నిర్మాతల్లో ఒకరు బయటికి వస్తున్నారన్న టాక్ ఇప్పటికే ఊపందుకుంది. ఇప్పుడీ పరిణామాలన్నీ మైత్రిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. మూడు ఫ్లాపులను తట్టుకోవడం ఎవరికైనా కష్టమే. దీనికి చెక్ పడాలి అంటే ఖచ్చితంగా ఓ రేంజ్ హిట్టు పడాలి. ఇక్కడ చూస్తేనేమో పరిస్థితి వేరుగా ఉంది. టైం అంటే అదే. పైకి తీసుకెళ్ళినట్టే వెళ్లి కిందకు పడేస్తుంది.