Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: ఆ వీడియోలలో ఒక వీడియో మనదైతే!

By:  Tupaki Desk   |   16 Oct 2019 1:14 PM GMT
ట్రైలర్ టాక్: ఆ వీడియోలలో ఒక వీడియో మనదైతే!
X
విజయ్ దేవరకొండ నిర్మాణంలో తరుణ్ భాస్కర్ ను హీరోగా పరిచయం చేస్తున్న చిత్రం 'మీకు మాత్రమే చెప్తా'. షమీర్ సుల్తాన్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ మూవీ ట్రైలర్ కాసేపటి క్రితమే రిలీజ్ అయింది. రెండు నిముషాల లోపే నిడివి ఉన్న ఈ ట్రైలర్లో సినిమా కాన్సెప్ట్ ను వివరించే ప్రయత్నం చేశారు.

మన లైఫ్ అంతా ఇప్పుడు స్మార్ట్ ఫోన్ చుట్టూనే తిరుగుతోంది. మన దేశ ప్రజలు రోజుకి షుమారుగా ఆరు గంటల సమయం వీడియోలు చూస్తూ గడుపుతున్నారట. ప్రతి ఫోన్ లో ఒక సీక్రెట్ ఉంటుంది. అలాగే మన హీరో తరుణ్ జేబులో ఉన్న స్మార్ట్ ఫోన్ లో ఒక సీక్రెట్ ఉంటుంది. అయితే సరిగ్గా తన పెళ్ళికి ముందు ఆ సీక్రెట్ బట్టబయలు కావడంతో నానా తంటాలు పడతాడు. ఆ సీక్రెట్ ఏంటి.. ఎందుకు ఆ సమస్య వచ్చింది.. ఎలా తరుణ్ ఆ సమస్య నుండి బైటపడ్డాడు అనేది స్టోరీలైన్. ఈ జెనరేషన్ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే థీమ్ తోనే సినిమాను తెరకెక్కించారని అర్థం ఆవుతోంది.

ట్రైలర్ స్టార్ట్ అయిన వెంటనే వెన్నెల కిషోర్ ఇచ్చిన వాయిస్ ఓవర్ లో "చెవులు చిట్లిపోయేవరకూ చెంపలు కాలిపోయేవరకూ వాగుతూనే ఉంటారు" అంటూ భారతీయుల ఫోన్ వ్యసనం గురించి క్లుప్తంగా చెప్పాడు. "మన దేశంలో రోజుకు ఆరు గంటలు వీడియోలు చూస్తూనే ఉంటారు. ఆ వీడియోలలో ఒక వీడియో మీదే అయితే?" అంటూ హీరో సమస్య గురించి ఇంట్రో ఇచ్చాడు. ఇక తన వీడియో లీక్ అయిందని తెలిసిన తర్వాత తరుణ్ ఫ్రెండ్ తో మాట్లాడుతూ "పెళ్ళి ఆగిపోతుంది.. చూసినోళ్లందరూ నవ్వుతారు. మా నాన్న ఇజ్జత్ పోతది. పుట్టబోయే కొడుకు ఈ వీడియోను చూడడం కంటే ఘోరం ఇంక లేదు" అంటూ తన ఆవేదన వ్యక్తం చేస్తాడు. హీరో ఆవేదన సీన్ తర్వాత వెన్నెల కిషోర్ తన వాయిస్ ఓవర్లో "దాని తర్వాత జగమే మాయ.. బతుకే బట్టలు సర్దుకొని పాయె" అంటూ కంక్లూజన్ ఇస్తాడు.

ఓవరాల్ గా టీజర్ ఆసక్తికరంగా ఉంది. యూత్ కు వెంటనే కనెక్ట్ అయ్యే స్టొరీ లైన్ ఇది. నటీనటులు కొత్తవారు కావడంతో టీజర్ లో ఒక ఫ్రెష్ ఫీల్ ఉంది. తరుణ్ కూడా కొత్త హీరోలా కాకుండా అనుభవం ఉన్న నటుడిలా ఈజ్ తో నటించినట్టు కనిపిస్తోంది. ఆలస్యం ఎందుకు.. చూసేయండి. వీడియోలు చూడడం అలవాటే కదా మనకు.. ఆరు గంటల్లో ఇది జస్ట్ రెండు నిముషాలు!