Begin typing your search above and press return to search.
మూవీ రివ్యూ : మీలో ఎవరు కోటీశ్వరుడు
By: Tupaki Desk | 16 Dec 2016 2:32 PM GMTచిత్రం : ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’
నటీనటులు: పృథ్వీ - నవీన్ చంద్ర - సలోని - శ్రుతి సోది - పోసాని కృష్ణమురళి - మురళీ శర్మ - రఘుబాబు - ప్రభాస్ శీను - జయప్రకాష్ రెడ్డి - విద్యు - ధన్ రాజ్ తదితరులు
సంగీతం: వసంత్
ఛాయాగ్రహణం: బాల్ రెడ్డి
నిర్మాత: కె.కె.రాధామోహన్
కథ - మాటలు: నాగేంద్ర కుమార్
స్క్రీన్ ప్లే - దర్శకత్వం: ఇ.సత్తిబాబు
కమెడియన్ గా చిన్న చిన్న వేషాలు వేసుకుంటున్న పృథ్వీ.. గత రెండేళ్లలో అనూహ్యంగా రైజ్ అయ్యాడు. ఇప్పుడు అతనే ప్రధాన పాత్రధారిగా ఓ సినిమా తెరకెక్కింది. అదే.. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’. ఈ చిత్రంలో నవీన్ చంద్ర కూడా కథానాయకుడే అయినా.. ఇది పృథ్వీ సినిమాగానే ప్రచారంలోకి వచ్చింది. ఆ రకంగా పృథ్వీ హీరోగా నటించిన తొలి సినిమా ఇదే అనుకోవాలి. కామెడీ చిత్రాల స్పెషలిస్టు ఇ.సత్తిబాబు దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
కోటీశ్వరుడి కూతురైన ప్రియ (శ్రుతి సోధి) తాగి పడిపోయిన తనను ఏమీ చేయకుండా ఇంటికి తీసుకొచ్చి దింపాడన్న కారణంతో ప్రశాంత్ (నవీన్ చంద్ర)ను ప్రేమించేస్తుంది. ముందు ప్రియ మీద అంతగా ఆసక్తి చూపించని ప్రశాంత్.. తర్వాత ఆమె ప్రేమలో పడిపోతాడు. ఐతే ప్రశాంత్ కు డబ్బు లేదని ప్రియ తండ్రి వీరి ప్రేమను ఒప్పుకోడు. ఐతే నిజమైన ఆనందం డబ్బులో లేదని.. ఒకసారి ఉన్న డబ్బంతా పోగొట్టుకుని.. ఆ తర్వాత కష్టపడి డబ్బు సంపాదిస్తే అందులోనే నిజమైన ఆనందం ఉంటుందని ప్రశాంత్ అనడంతో.. ప్రియ తండ్రి తన దగ్గరున్న డబ్బు పోగొట్టుకోవవడం కోసం వీర బాబు (పృథ్వీ) అనే హీరోతో ఒక చెత్త సినిమా తీయడానికి రెడీ అవుతాడు. మరి ఆ సినిమా ఎలా వచ్చింది.. ఎలాంటి ఫలితాన్నందుకుంది.. ప్రియ తండ్రి చివరికి ఆమె ప్రేమ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడన్నది మిగతా కథ.
కథనం - విశ్లేషణ:
ఈ మధ్య కామెడీ అంటేనే పేరడీలు.. స్పూఫులే అయిపోయాయి. సిచువేషనల్ కామెడీ పండించాలన్నా.. కొత్తగా ఏదైనా కామెడీ ట్రై చేయాలన్నా కష్టం కానీ.. స్పూఫ్ లేదా పేరడీ అంటే ఈజీగా పనైపోతుంది.. పైగా ఈ టైపు కామెడీకి సక్సెస్ రేట్ కూడా బాగానే ఉంది.. అనే భ్రమలతో తెరకెక్కిన సినిమా ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’. దీన్ని సినిమా అనడం కంటే పేరడీలు.. స్పూఫుల ప్యాకేజీ అంటే బెటరేమో. దుబాయ్ శీనులో ఎమ్మెస్ నారాయణ పాత్రలో పృథ్వీని పెట్టి.. అదే పాత్రతో ఒక ఫుల్ లెంగ్త్ పాత్ర చేయిస్తే ఎలా ఉంటుందో అదే.. మీలో ఎవరు కోటీశ్వరుడు.
స్ఫూప్ చేసినా.. పేరడీ డైలాగ్ పేల్చినా.. అవి షార్ట్ గా ఉంటే సరదాగా అనిపిస్తాయి. కానీ సినిమా మొత్తం అవే అంటే మొహం మొత్తేయకుండా పోదు. పైగా పృథ్వీ వీరావేశంతో బాలయ్య డైలాగులు చెప్పడమేమైనా కొత్తా..? వయసు మళ్లిన హీరోను స్టూడెంటులాగా చూపించి సెటైరికల్ కామెడీ చేయడం తెలుగు సినిమాల్లో ఇప్పుడే చూస్తున్నామా? ఇలాంటి అంశాలతో ఏకంగా ఓ సినిమానే తీసేసి.. దాన్నే ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’లో ఒక ఉప కథ లాగా చూపించారు. దాదాపు సగం సినిమాలో ఈ సినిమానే కనిపిస్తుంది. ఐరనీ ఏంటంటే.. ఎంత మొహం మొత్తినప్పటికీ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’లో ఆకట్టుకునే ప్రధానాంశం.. ఈ సినిమాలో పృథ్వీ పాత్ర చుట్టూ అల్లుకున్న స్పూఫులు.. పేరడీ సన్నివేశాలే.
ఈ సినిమాలో పృథ్వీ తెరమీదికి రావడానికి దాదాపు గంట సమయం పడుతుంది. అతను వచ్చే వరకు ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టేలా సాగుతాయి కథాకథనాలు. నవీన్ చంద్ర-శ్రుతి సోధిల మధ్య సాగే ప్రేమాయణం చాలా రొటీన్ గా.. బోరింగ్ గా సాగుతుంది. తాగి పడిపోయిన తనను హీరో ఇంటికి తీసుకొచ్చి దింపాడని హీరోయిన్ ఇంప్రెస్ అయిపోవడం.. హీరో దగ్గరికొచ్చి క్లాస్ రూంలో అందరి ముందూ రాత్రి నన్నెందుకు ఏమీ చేయలేదనడం విడ్డూరంగా అనిపిస్తాయి. ఈ లవ్ స్టోరీ సాగుతున్నంత సేపూ ఇంకెప్పుడూ పృథ్వీ వస్తాడని ఎదురు చూస్తారు ప్రేక్షకులు.
ఇక పృథ్వీ వచ్చాక తెర మొత్తం స్పూఫులు.. పేరడీలతో నిండిపోతుంది. కొన్ని చోట్ల నవ్వులు పండుతాయి కానీ.. ఈ ఎపిసోడ్ మరీ సాగదీయడంతో బోర్ కొట్టించేస్తుంది. ద్వితీయార్ధమంతా ఈ రెండో సినిమాతోనే నింపేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రథమార్ధంలో పృథ్వీ కోసం నిరీక్షించినట్లే.. ద్వితీయార్ధంలో సినిమా ముగింపు కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. రెండు గంటల 10 నిమిషాల నిడివే అయినా.. సినిమా లెంగ్తీగా అనిపిస్తుందంటే కథనం సాగే తీరే అందుకు కారణం. ఓవరాల్ గా కొన్ని కామెడీ సీన్లు మినహాయిస్తే ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’లో చెప్పుకోదగ్గ విశేషాలేమీ కనిపించవు.
నటీనటులు:
సినిమాకు ఆకర్షణ అంటే పృథ్వీనే. తన కామెడీ టైమింగ్ తో.. తనకు అలవాటైన రీతిలోనే కొన్ని చోట్ల నవ్వించాడు. నవీన్ చంద్ర ఇలాంటి సినిమా ఎందుకు చేశాడో అర్థం కాదు. అతడి టాలెంటుకి ఇలాంటి పాత్ర చేయడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. హీరోయిన్లలో సలోని పర్వాలేదు. శ్రుతి సోధి గురించి చెప్పడానికేమీ లేదు. మురళీ శర్మది కూడా మామూలు పాత్రే. రఘుబాబు.. పోసాని కృష్ణమురళి కొంత వరకు నవ్వించారు.
సాంకేతిక వర్గం:
టెక్నికల్ గా ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’లో మెరుపులేమీ లేవు. వసంత్ సంగీతం సాదాసీదాగా ఉంది. పాటలు.. నేపథ్య సంగీతం మామూలుగా అనిపిస్తాయి. బాల్ రెడ్డి ఛాయాగ్రహణం కూడా సినిమాకు తగ్గట్లే ఉంది. నిర్మాణ విలువలు పర్వాలేదు. నాగేంద్ర కుమార్ కథలో పెద్ద విశేషం ఏమీ లేదు. మాటలు అక్కడక్కడా నవ్వించాయి. కథే వీక్ అంటే.. దాన్ని ఆనాసక్తికరమైన స్క్రీన్ ప్లేతో బోరింగ్ గా నడిపించాడు దర్శకుడు సత్తిబాబు. కామెడీని హ్యాండిల్ చేయడంలో అతడి పట్టు కొన్ని చోట్ల కనిపిస్తుంది కానీ.. అంతకుమించి ఏ ప్రత్యేకతా చూపించలేకపోయాడు.
చివరగా: మీలో ఎవరు కోటీశ్వరుడు.. అవే స్పూఫులు.. అవే పేరడీలు
రేటింగ్: 2/5
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre