Begin typing your search above and press return to search.

అఖిల్ గురించి అఖిల్ ఏం మాట్లాడతాడు?

By:  Tupaki Desk   |   27 Nov 2015 6:18 AM GMT
అఖిల్ గురించి అఖిల్ ఏం మాట్లాడతాడు?
X
‘అఖిల్’ సినిమా రిజల్ట్ అక్కినేని అఖిల్ ను తీవ్ర నిరాశకు గురి చేసే ఉంటుంది. సినిమా విడుదలైన రెండు మూడు రోజులు ప్రమోషన్లలో పాల్గొన్న అఖిల్.. ఆ తర్వాత ఫ్రెండ్స్ తో కలిసి వెకేషన్ కోసం గోవాకు వెళ్లిపోయాడు. దీంతో మళ్లీ ఎక్కడా అఖిల్ ను చూసే అవకాశం లేకపోయింది అభిమానులకు. ఐతే అఖిల్ ను తండ్రి నాగార్జునతో కలిసి చూసే ఛాన్స్ వస్తోంది ఫ్యాన్స్ కి.

ఈ రోజే మొదలు కాబోతున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ మూడో సీజన్ తొలి ఎపిసోడ్ లో నాగార్జున - అఖిల్ కలిసి సందడి చేయబోతున్నారు. ‘అఖిల్’ సినిమాలో అక్కినేని అక్కినేని పాటలో కనిపించిన డ్రెస్సులో అఖిల్ హాట్ సీట్ లో కూర్చుంటుండటం విశేషం. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పటికే ఆసక్తి రేపుతోంది. ఈ ఎపిసోడ్ ‘అఖిల్’ విడుదలకు ముందు షూట్ చేశారా.. తర్వాతా అన్నదే తెలియట్లేదు.

ఒకవేళ ముందు చేస్తే ఇప్పటికి రిలవెంట్ గా ఉంటుందా లేదా అన్నది ప్రశ్న. ‘అఖిల్’ వచ్చాక ఎపిసోడ్ చేసి ఉంటే.. ఆ సినిమా రిజల్ట్ గురించి నాగ్ అయినా, అఖిల్ అయినా ఏం మాట్లాడతారో చూడాలి. తన తొలి సినిమా విడుదలకు ముందే కాబోయే సూపర్ స్టార్ గా కితాబందుకున్న అఖిల్ తొలి సినిమాలో తన వరకు బాగానే పెర్ఫామ్ చేశాడు కానీ. సినిమా మాత్రం నిలబడలేకపోయింది.