Begin typing your search above and press return to search.

నాకు ఎవ్వ‌రూ ప్ర‌పోజ్ చేయ‌లేదు.. ఆ హీరోయిన్ మాత్రం గోడ దూకిందిః మీనా

By:  Tupaki Desk   |   7 March 2021 11:30 PM GMT
నాకు ఎవ్వ‌రూ ప్ర‌పోజ్ చేయ‌లేదు.. ఆ హీరోయిన్ మాత్రం గోడ దూకిందిః మీనా
X
తెలుగు తెర‌పై హ‌వా కొన‌సాగించిన నిన్న‌టి త‌రం హీరోయిన్ల‌లో మీనా ఒక‌రు. చూడ‌చ‌క్క‌టి రూపంతో.. అద్భుత‌మైన అభిన‌యంతో స‌త్తా చాటింది. పెళ్లి త‌ర్వాత సినిమాల‌కు దూర‌మైన ఈమె.. మ‌ళ్లీ రీ-ఎంట్రీ ఇచ్చింది. దృశ్యం రెండు పార్టుల్లోనూ అద‌ర‌గొట్టింది. అయితే.. తాజాగా ప‌లు సీక్రెట్లు బ‌య‌ట‌పెట్టింది మీనా.

ఇందులో ప్ర‌ధాన‌మైంది త‌న ల‌వ్ గురించి. తాను హీరోయిన్ గా ఉన్న‌ప్పుడు ఒక్క‌రు కూడా ల‌వ్ ప్ర‌పోజ్ చేయ‌లేదట‌. నిజానికి చాలా మంది హీరోయిన్ల‌కు ప్రపోజ‌ల్స్ రావ‌డం కామ‌నే. కానీ.. ఈమెకు మాత్రం ఒక్క‌రు కూడా ప్రేమిస్తున్నాన‌ని చెప్ప‌లేద‌ట‌. దీనికి కార‌ణం కూడా చెప్పింది మీనా. తాను న‌టించిన హీరోలంద‌రూ అప్ప‌టికే పెద్ద‌వాళ్ల‌ని చెప్పింది. ద‌ర్శ‌కులు, ఇతర టెక్నీషియ‌న్ల‌కు సైతం అప్ప‌టికే పెళ్లిళ్లు అయిపోయాయ‌ని, అందుకే.. త‌న‌కు ల‌వ్ ప్ర‌పోజ‌ల్స్ రాలేద‌ని చెప్పింది.

ఇక‌, తాను టాప్ హీరోయిన్ గా కొన‌సాగిన కాలంలో.. ఎవ‌రి నుంచి పోటీ ఎదుర్కొన్న‌దో కూడా వివ‌రించింది. ప్ర‌ధానంగా తాను ముగ్గురు హీరోయిన్ల నుంచి గ‌ట్టి పోటీ ఉండేద‌ని చెప్పింది. వారిలో రోజా, ర‌మ్య‌కృష్ణ‌, న‌గ్మ ఉన్నార‌ని తెలిపింది. వీరిలో త‌న ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి రోజానే అని వెల్ల‌డించింది మీనా.

రోజా అప్ప‌ట్లోనే చాలా బోల్డ్ అని బ‌య‌ట‌పెట్టింది. ఆమెకు చాలా ధైర్యం ఉండేద‌ని, చెప్పిన టైమ్ కు షూట్ కంప్లీట్ కాక‌పోతే.. మ‌రో షూటింగ్ కు లేటైపోతుందని, గోడ దూకి మ‌రీ వెళ్లిపోయేద‌ని చెప్పింది. అంద‌రితో తాను బాగానే ఉన్నాన‌ని, అంద‌రూ త‌న‌తో మంచి రిలేష‌న్ కొన‌సాగించార‌ని అన్న‌ది మీనా.