Begin typing your search above and press return to search.
నాలా నా కూతురు కాకూడదు
By: Tupaki Desk | 16 April 2016 5:33 AM GMTఅలనాటి హీరోయిన్ మీనా కూతురు తెరంగేట్రం చేసింది. విజయ్ లేటెస్ట్ మూవీ తెరిలో హీరో కూతురుగా నైనిక నటన అందరినీ ఆకట్టుకుంది. అయితే.. ఈ పాత్రకు తన కూతురుతో చేయించే ముందు సంఘటనలను పంచుకుంది మీనా.
దర్శకుడు అట్లీ ఈ మూవీ కోసం తన దగ్గరకు వచ్చినపుడు... తనకేదైనా రోల్ ఆఫర్ చేస్తారని అనుకుందట మీనా. అయితే.. పాత్ర తన కూతురు కోసం అని తెలిసినపుడు ఆశ్చర్యపోయిందట. కానీ.. మూవీలో ఆ రోల్ కి ఉన్న ప్రాధాన్యత చూసి ఒప్పుకున్నానని చెబ్తోంది. అంతే కాదు.. ప్రతీ రోజూ షూటింగ్ కి వెళ్లి వీలైనంతగా మెళకువలు చెప్పేదిట. అయినా నైనిక చాలా యాక్టివ్ అని.. తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకుందని అంటోంది మీనా.
ఈ సినిమాలో చేసినంత మాత్రాన ఇకపై నైనికి చైల్డ్ యాక్టర్ గా కొనసాగదని తేల్చేసింది మీనా. దీనికి కారణం తన చిన్నతనాన్ని మిస్ చేయకూడదని అనుకుంటోందట. ఒక చైల్డ్ యాక్టర్ గా తాను ఏం పోగొట్టుకున్నానో తనకు తెలుసుకాబట్టి.. తన కూతురు నైనికకు ఆ పరిస్థితి రాకూడదన్నది మీనా ఉద్దేశ్యం.