Begin typing your search above and press return to search.
భర్త మృతి పై అసత్య ప్రచారంపై మీనా మనోవేదన
By: Tupaki Desk | 1 July 2022 3:50 PM GMTసీనియర్ హీరోయిన్ మీనా భర్త విద్యా సాగర్ మృతి విషయమై తమిళ మీడియా.. జాతీయ మీడియా పలు రకాల కథనాలను ప్రచురించింది. తమిళ మీడియాలో వచ్చిన లీడ్స్ తో తెలుగు మీడియా కూడా పుంకాను పుంకాలుగా పుకార్లను ప్రచారం చేయడం మొదలు పెట్టింది.
ఒక వైపు విద్యా సాగర్ మృతి చెంది కుటుంబ సభ్యులు మరియు మీనా సన్నిహితులు ఇండస్ట్రీ వర్గాల వారు బాధలో ఉండగా మీడియాలో వచ్చిన కథనాలు వారికి మరింతగా ఇబ్బంది గా మారాయి.
మీనా ఈ కథనాలపై ఎక్కువ సమయం ఇవ్వకుండా స్పందించారు. దుఃఖంలో మేము ఉండగా ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు కథనాలు రాయడం ఏమాత్రం కరెక్ట్ కాదు అన్నట్లుగా ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. సోషల్ మీడియా ద్వారా మీడియా కథనాలపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. మా యొక్క ప్రైవసీని మీరు అర్థం చేసుకోవాలంటూ మీడియా వారికి విజ్ఞప్తి చేసింది.
ఇదే సమయంలో కష్ట సమయంలో తమతో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసింది. ముఖ్యంగా తన భర్త ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించిన వైద్యులకు.. అందుకు సహకరించిన తమిళనాడు ముఖ్యమంత్రి కి.. ఆరోగ్య శాఖ మంత్రి ఇంకా స్నేహితులకు మీనా ధన్యవాదాలు తెలియజేసింది. విద్యా సాగర్ అనారోగ్యంతో ఉన్న సమయంలో కోలుకోవాలని ప్రార్థనలు చేసిన వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసింది.
మీనా భర్త ఈ ఏడాది కరోనా బారిన పడ్డారు. ఆయన పోస్ట్ కోవిడ్ సమస్యలను ఎదుర్కొంటున్నాడు. దానికి తోడు మీనా ఇంటి సమీపంలో ఎక్కువ సంఖ్యలో పావురాలు ఉండటం వల్ల వాటి వ్యార్థాల ద్వారా వచ్చే దుర్వాసన కారణంగా శ్వాస సంబంధిత సమస్యలు వచ్చాయి అనేది మీడియాలో కథనాలు వచ్చాయి.
మొత్తానికి రకరకాలుగా విద్యా సాగర్ మృతి గురించి కథనాలు రావడంతో మీనా మనోవేదనకు గురి అయ్యి స్వయంగా సోషల్ మీడియా ద్వారా కథనాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు.