Begin typing your search above and press return to search.

మీనా.. పిచ్చి పిచ్చిగా పొగిడేస్తోందంతే

By:  Tupaki Desk   |   7 July 2015 12:14 PM IST
మీనా.. పిచ్చి పిచ్చిగా పొగిడేస్తోందంతే
X
మీన నేత్రి మీనా ఒకే పాత్రలో రెండు భాషల్లో నటించిన సంగతి తెలిసిందే. తొలుత మలయాళ 'దృశ్యం'లో మోహన్‌లాల్‌ సరసన ఓ మధ్యతరగతి ఇల్లాలి పాత్రలో నటించి ఆకట్టుకుంది. ఆ తర్వాత అదే సినిమాని తెలుగులో సేమ్‌ టైటిల్‌తో రీమేక్‌ చేస్తే ఇక్కడా విక్టరీ వెంకటేష్‌కి భార్యగా నటించి మెప్పించింది. అయితే ఇదే చిత్రాన్ని ఇప్పుడు తమిళ్‌లో పాపనాశం పేరుతో రీమేక్‌ చేసి రిలీజ్‌ చేశారు.

అక్కడ కమల్‌హాసన్‌-గౌతమి జంట (రియల్‌ లైఫ్‌లో) ఆన్‌స్క్రీన్‌ జోడీగా నటించారు. ఈ ఇద్దరి మధ్యా కెమిస్ట్రీకి తంబీలు ఫ్లాటైపోయారు. పాపనాశం బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టింది. పరిమిత బడ్జెట్‌తో తెరకెక్కి తమిళనాట రికార్డులు బ్రేక్‌ చేస్తోంది. ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ.. ''ఇప్పటివరకూ నాలుగు భాషల్లో రీమేకైన ఈ సినిమాలో రిలీజైన వాటిలో ది బెస్ట్‌ ఈ సినిమానే. పాపనాశంలో కమల్‌హాసన్‌ ఓ కామన్‌మేన్‌ పాత్రలో జీవించారు. అతడు పాత్రకి జీవం పోశారంటే అతిశయోక్తి లేదు. అతడికి పెయిర్‌గా గౌతమి అద్భుతంగా అభినయించారు. అంతేనా పిల్లలుగా నటించిన నివేద, ఎస్తర్‌లు కూడా అంతే చక్కగా అభినయించార''ని పొగిడేశారు మీనా.

పాత్రల్లోకి లోకల్‌ యాస, భాషను ఎడాప్ట్‌ చేసుకోవడంలో కమల్‌, గౌతమితో పాటు ఇతర పాత్రధారులు అద్భుతంగా లీనమయ్యారని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది మీనా. ముఖ్యంగా కమల్‌హాసన్‌ ఈ సినిమాకి గొప్ప కలర్‌ తీసుకొచ్చారని ప్రశంసించింది. అతడిని ఇమ్మిటేట్‌ చేయడం వేరొకరి వల్ల కానేకాదని పొగిడేసి పరిశ్రమ ప్రముఖుల కళ్లను తనవైపు తిప్పేసుకుంది మీనా.