Begin typing your search above and press return to search.

మా కాలంలోనూ కాస్టింగ్ కౌచ్ వుంది!

By:  Tupaki Desk   |   27 Aug 2018 10:21 AM GMT
మా కాలంలోనూ కాస్టింగ్ కౌచ్ వుంది!
X
కాస్టింగ్ కౌచ్.. సినిమా ఇండస్ట్రీని పట్టిన ఈ భూతం ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు.. దశాబ్ధాలుగా సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామని వర్ధమాన నటీమణులను వాడుకుంటున్నారని విమర్శ ఉంది. ఇటీవల టాలీవుడ్ లో వివాదాస్పద నటి శ్రీరెడ్డి దీన్ని బయటకు తీసి రచ్చ రచ్చ చేసింది. ఇక్కడే కాదు.. చెన్నై వెళ్లి తమిళ సినీ ప్రముఖుల పరువును బజారుకీడ్చింది. ప్రస్తుతం కోలీవుడ్, టాలీవుడ్ ను ఊపేస్తున్నా కాస్టింగ్ కౌచ్ గురించి ఏ ఇంటర్వ్యూ ఫేస్ చేసినా హీరోయిన్లను మొదటి ప్రశ్నగా దీన్నే అడుగుతున్నారు..

తాజాగా అలనాటి టాప్ హీరోయిన్ మీనాకు కూడా ఈ ప్రశ్న ఎదురైంది.. దీనికి మీనా సమాధానమిచ్చింది. ‘అది చాలా విచారకరమైన విషయం.. అన్ని రంగాల్లోనూ మహిళలకు సమస్యలున్నాయి. అలాంటి సంఘటనలను నేను ఎదుర్కోలేకపోయినా.. మా కాలంలోనూ ఆ టార్చర్ ఉండేది. వక్రబుద్ది కలిగిన మగాళ్లు మారాలి. స్త్రీలతో డీల్ మాట్లాడే ముందు తమ భార్య, పిల్లలు ఉన్నారనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ప్రతిభను ప్రదర్శించే అవకాశాల కోసం స్త్రీలు పోరాడాలి’ అని మీనా సంచలన వ్యాఖ్యలు చేసింది.