Begin typing your search above and press return to search.
యూరప్ చుట్టేస్తున్న సీనియర్ హీరోయిన్!
By: Tupaki Desk | 25 Jan 2023 1:30 PM ISTఒకనాటి హీరోయిన్ మీనా ప్రస్తుతం యూరప్ లో ప్రత్యేకంగా విహరిస్తోంది. వెకేషన్ కోసం కూతురుతో కలిసి యూరప్ వెళ్లింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ఇన్ స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది. అక్కడి అందాల మధ్య ఫొటోలకు పోజులిస్తూ సెల్ఫీలు తీసుకుంది. ఆ ఫొటోలనే అభిమానులతో పంచుకోవడంతో మీనా యూరప్ కు ప్రత్యేక వెకేషన్ కోసం వెళ్లినట్టుగా తెలిసింది. బెల్జియం, జర్మనీల్లో విహరిస్తున్న ఫొటోలని కూడా అభిమానులతో పంచుకుంది.
అంతే కాకుండా ఈ ఫోటోలకు ఫరెవర్ 2023లో ఫస్ట్ సెల్ఫీ` అంటూ హ్యాష్ గ్యాగ్ తో క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గత ఏడాది జూన్ లో మీనా భర్తని కోల్పోయిన విషయం తెలిసిందే. మీనా భర్త పోస్ట్ కోవిడ్ కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురికావడం, ఆ కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చివరికి చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్ లో తుదిశ్వాస విడవడం తెలిసిందే.
మీనా భర్త విద్యాసాగర్ కు కోవిడ్ సోకి ఆ తరువాత కోలుకున్నారు. కానీ లంగ్ ఇన్ఫెక్షన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడిన ఆయన లంగ్స్ పూర్తిగా దెబ్బతినడంతో ఆరోగ్యం విషమించి తుదిశ్వాస విడిచారు. అయితే మీనా ఫ్యామిలీ ప్రేమగా పెంచుకుంటున్న పావురాల కారణంగానే అవి వదిలిన వ్యర్థాళల వల్ల లంగ్స్ ఇన్ఫెక్షన్ కు గురి కావడంతో మృతి చెందారని ప్రచారం జరిగింది. మీనా, విద్యాసాగర్ లకు 13 ఏళ్ల క్రితం 2009లో జూలై 12న వివాహం జరిగింది.
విద్యాసాగర్ సాఫ్ట్ వేర్ గా పని చేసేవారు. వీరిద్దరికి ఓ పాప వుంది. విద్యాసాగర్ మరణం తరువాత తీవ్ర మనస్థాపానికి గురైన మీనా కొంత కాలం సినిమాలకు దూరంగా వుంటూ వచ్చింది. ప్రస్తుతం మీనా తమిళంలో `రౌడీ బేబీ`, మలయాళంలో `జానమ్మ డేవిడ్` మూవీల్లో నటిస్తోంది. `జానమ్మ డేవిడ్` షూటింగ్ ప్రారంభం కావాల్సి వుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.