Begin typing your search above and press return to search.
మహేశ్ బాబుపై మనసు పడుతున్న మీనా
By: Tupaki Desk | 20 May 2016 6:37 AM GMTషాక్ అవ్వకండి.. ఇది నిజమే - కానీ, మీరు అనుకుంటున్నట్లేమీ కాదు. మహేశ్ బాబుతో సినిమా తీయాలని మాత్రమే మీనా తహతహలాడుతోంది. అవును, మాజీ హీరోయిన్ మీనా ఇప్పుడు సినీ నిర్మాణంలో అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. అందుకు తెలుగు - తమిళ ఇండస్ర్టీలను వేదికగా చేసుకోవాలని అనుకుంటున్నారు. అయితే, చిన్నాచితకా సినిమాలు కాకుండా భారీ బడ్జెట్ సినిమాలు తీసి సూపర్ డూపర్ హిట్లు కొట్టాలన్నది మీనా ప్లానట. అందుకోసం తెలుగు - తమిళ ఇండస్ట్రీల్లో ఆమె కొందరు కథానాయకులతో సినిమాలు తీయాలని ప్లాన్ చేస్తున్నారట. తెలుగు విషయానికొస్తే తిరుగులేని ఇమేజ్ ఉన్న మహేశ్ తో సినిమా తీయాలని మీనా అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. కానీ.. మహేశ్ ఒప్పుకొన్న ప్రాజెక్టులను చూస్తుంటే ఇప్పుడిప్పుడే మీనా కల నెరవేరేలా కనిపించడం లేదు.
ప్రస్తుతం మహేశ్ నటించిన బ్రహ్మోత్సవం విడుదలైంది. ఆ తరువాత మురుగుదాస్ సినిమా స్క్రీనింగ్ లో ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ - పూరీ జగన్నాథ్ కూడా మహేశ్ తో సినిమా తీసేందుకు క్యూలో నిల్చున్నారు. ఇలాంటి సమయంలో మీనాకు మహేశ్ కాల్షీట్లు దొరకడం కష్టమే అని చెప్పాలి.
అయితే.. మహేశ్ తో సినిమా కోసం రెడీగా ఉన్న డైరెక్టర్లను ఒప్పించగలిగి తన నిర్మాణంలో సినిమా ప్లాన్ చేస్తే మీనా అనుకున్నది సాధించినట్లే. మరోవైపు తమిళంలో కమల్ హాసన్ తో తన మొదటి సినిమా నిర్మించాలని మీనా అనుకుంటోందట. అక్కడ ఆమె అదృష్టం ఎలా ఉంటుందో చూడాలి.