Begin typing your search above and press return to search.
డాక్టర్ కాబోయి యాక్టర్ కావాలనుకుంటే అలా అయ్యింది!
By: Tupaki Desk | 24 Jun 2021 7:30 AM GMTడాక్టర్ కాబోయి యాక్టర్ అయిన భామ మీనాక్షి చౌదరి. డెంటిస్టుగా డిగ్రీ అందుకుని అటుపై మిస్ హర్యానాగా కిరీటం గెలుచుకున్న ఈ బ్యూటీ వేగంగానే వెండితెర వైపు అడుగులు వేసింది. బ్యాక్ టు బ్యాక్ టాలీవుడ్ లో సుశాంత్ - రవితేజ లాంటి స్టార్ల సరసన అవకాశాలు అందుకుంది.
మాస్ మహారాజా రవితేజ- రమేష్ వర్మ మూవీ `ఖిలాడీ`లో అవకాశం అందుకుంది. ఈ మూవీలో డింపుల్ హయాతి ఒక నాయిక కాగా మీనాక్షి చౌదరిని మరో నాయికగా నటిస్తోంది. ఇటీవల రిలీజైన ఖిలాడీ ఫస్ట్ లుక్ కి స్పందన బావుంది. రాక్షసుడు లాంటి సైకో థ్రిల్లర్ కి దర్శకత్వం వహించిన రమేష్ వర్మ హీరో -విలన్ మధ్య మైండ్ గేమ్ నేపథ్యంలోని ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.
సుశాంత్ సరసన `ఇచట వాహనములు నిలపరాదు` అనే చిత్రంలోనూ మీనాక్షి చౌదరి నటిస్తోంది. ఇందులో మీనాక్షి ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన స్మార్ట్ మోడ్రన్ గాళ్ పాత్రను పోషించింది. మీనాక్షి ఒకేసారి రెండు సినిమాల్లో నటిస్తున్నా ఇవేవీ ఇంకా రిలీజ్ కి రాలేదు. కోవిడ్ వల్ల అంతకంతకు ఆలస్యమవుతున్నాయి.
అందాల రాణిగా మీనాక్షి వెలుగులు ఆసక్తికరం. మయన్మార్- యాంగోన్ లో జరిగిన మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018 అందాల పోటీలో మొదటి రన్నరప్ టైటిల్ ను గెలుచుకున్న తర్వాత ఫెమినా మిస్ ఇండియా 2018 పోటీలో మిస్ గ్రాండ్ కిరీటాన్ని మీనాక్షి అందుకుంది. రంగుల ప్రపంచంలో మీనాక్షి పెద్ద కలలకు కరోనా మహమ్మారీ రూపంలో బిగ్ బ్రేక్ పడింది.