Begin typing your search above and press return to search.

హిట్ 2 బ్యూటీ.. ఘాటైన పోజులు!

By:  Tupaki Desk   |   14 Dec 2022 3:41 AM GMT
హిట్ 2 బ్యూటీ.. ఘాటైన పోజులు!
X
ఇటీవల హిట్ 2 సినిమాలో అడవి శేష్ సతీమణిగా చాలా హోమ్లీగా కనిపించిన మీనాక్షి చౌదరి ఓవర్గం వారిని బాగానే ఆకట్టుకుంది. ఈ బ్యూటీ తన క్యూట్ స్మైల్ తోనే ఎక్కువగా ఎట్రాక్ట్ చేసిందని చెప్పవచ్చు. ఇప్పటివరకు తెలుగులో ఆమె చేసింది కేవలం మూడు సినిమాలే అయినప్పటికీ కూడా ఇండస్ట్రీలో మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది. తప్పకుండా భవిష్యత్తులో మంచి క్రేజ్ ఉన్న సినిమాలు అందుకునే ఛాన్స్ అయితే ఉంటుంది అని కూడా అనిపోస్తోంది.

ఎందుకంటే బ్యూటిఫుల్ మీనాక్షి తన గ్లామర్ డోస్ కూడా పెంచే ప్రయత్నం చేస్తుంది. సినిమాలో కాస్త ట్రెడిషనల్ లుక్కుతో పాటు రొమాంటిక్ సాంగ్ లో కూడా బాగానే ఆకట్టుకుంది.

అయితే అలాంటి గ్లామర్ పాత్రల్లో కూడా నటించడానికి సిద్ధమే అని అమ్మడు ఫోటోషూట్స్ తో కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. రీసెంట్ గా ఆమె నల్లటి స్లీవ్‌లెస్ టాప్ ధరించి తన గ్లామ్‌ను ప్రదర్శిస్తోంది. ఆలయ ఆమె మంత్రముగ్ధులను చేసే లుక్స్ తో కుర్రాళ్ళ గుండెల్లో గబులు పెంచుతోంది.

ఆమె చిరునవ్వు చూడటం కళ్లకు ఆనందాన్ని కలిగిస్తుంది అని ఫాలోవర్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. మొత్తానికి ఈ బ్యూటీ డిఫరెంట్ గ్లామర్ తో అయితే సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోవర్స్ ను బాగానే పెంచుకుంటుంది.

అలాగే అగ్ర హీరోలతో కూడా వెంట వెంటనే చాన్సులు అందుకోవాలని కూడా ప్రయత్నాలు చేస్తోంది. మొదట మీనాక్షి చౌదరి ఇచ్చట వాహనములు నడుపరాదు అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది.

ఇక తర్వాత రవితేజ ఖిలాడి సినిమాలో కూడా నటించింది. ఆ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యాయి. ఇక ఇప్పుడు హిట్ 2 సినిమా మాత్రం సక్సెస్ అయ్యింది. దీంతో అమ్మడం ఇండస్ట్రీలో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం అయితే తమిళంలోనే ఒక సినిమా చేస్తోంది. అలాగే హిందీలో కూడా కొన్ని ఆఫర్స్ వచ్చినట్లు తెలుస్తోంది. మరి ఈ బ్యూటీకి అగ్ర హీరోలతో ఎప్పుడు ఆఫర్లు దక్కుతాయో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.