Begin typing your search above and press return to search.

అసిస్టెంట్ డైరెక్టర్ చెంప చెల్లుమనిపించిన నటి

By:  Tupaki Desk   |   23 Nov 2015 9:26 AM GMT
అసిస్టెంట్ డైరెక్టర్ చెంప చెల్లుమనిపించిన నటి
X
అవును.. ఆ హీరోయిన్ అసిస్టెంట్ డైరెక్టర్ చెంప చెల్లుమనిపించింది. ఈ సంఘటన ప్రస్తుతం కోలీవుడ్ లో సంచలనం రేపుతోంది. అసిస్టెంట్ డైరెక్టర్ తప్పేమీ లేకున్నా హీరోయిన్ అహంకారంతో ఇలా లెంపకాయ ఇవ్వడంపై ఆ యూనిట్ సభ్యులందరూ మండిపడుతున్నారు. ఇంతకీ ఈ వ్యవహారానికి సంబంధించి వివరాలేంటో చూద్దాం పదండి.

తమిళంలో మీనాక్షి అనే అప్ కమింగ్ హీరోయిన్ ఉంది. ఆమె నటించిన సినిమాలన్నీ హిట్టవుతుండటంతో మంచి డిమాండే వస్తోంది. దీంతో అమ్మడికి అహంకారం బాగా పెరిగిపోయింది. తాను హీరోయిన్ గా నటిస్తున్న ‘నేర్ ముగామ్’ అనే సినిమా షూటింగ్ సందర్భంగా ఆమె శంకర్ అనే అసిస్టెంట్ డైరెక్టర్ని సెట్లో అందరూ చూస్తుండగా చెంపదెబ్బ కొట్టింది.

ఇంతకీ అతను చేసిన తప్పేంటి అంటే.. మీనాక్షి ఉన్న వ్యానిటీ వ్యాన్ లోకి వెళ్లి మంచి నీళ్లు తెచ్చుకోవడమేనట. అతనేమీ అసభ్యంగా కూడా ప్రవర్తించలేదట. నీ స్థాయిని నా వ్యానిటీ వ్యాన్ లోకి వచ్చి నీళ్లు తీసుకుంటావా అని ఆమె చెంపదెబ్బ కొట్టిందట. ఐతే యూనిట్ సభ్యులందరూ ఆమె తీరును తప్పుబట్టడంతో అక్కడే శంకర్ కు సారీ చెప్పిందట మీనాక్షి. ఐతే కేవలం సారీ చెప్పేస్తే సరిపోదని యూనిట్ సభ్యులు అనడంతో క్షమాపణ లేఖ రాసి, ఇకపై ఇలా చేయనని చెబుతూ ఆ లేఖతో పాటుగా ఫొటో కూడా దిగింది. ఆ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.