Begin typing your search above and press return to search.
నకిలీ ఐడీ కార్డుతో.. పవన్ హీరోయిన్ ఏం చేసిందో తెలుసా?
By: Tupaki Desk | 30 May 2021 4:20 AM GMTదేశంలో కొవిడ్ వ్యాక్సిన్.. డిమాండ్ కు సరిపడా సప్లై కావట్లేదని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ లోనూ బడాబాబులు, రాజకీయ పైరవీలతో పక్కదారి పడుతోందనే విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణ జనం రోజుల తరబడి వ్యాక్సిన్ కేంద్రాలకు వెళ్లి, గంటల తరబడి క్యూలో నిల్చుంటున్నారు. అయితే.. దొడ్డి దారిన వ్యాక్సిన్ పొందేవారు మాత్రం తమ పని తేలిగ్గా కానిచ్చేస్తున్నారు.
తాజాగా.. హీరోయిన్ మీరా చోప్రా ఇదే విధంగా వ్యాక్సిన్ వేయించుకున్నట్టు సమాచారం. ఇందుకోసం నకిలీ ఐడీ కార్డును కూడా తయారు చేయించిన విషయం బయటపడింది. దీంతో.. ఈ వ్యవహారం దుమారం రేపుతోంది. దేశంలో ముందుగా ఫ్రంట్ లైన్ వారియర్స్ కు వ్యాక్సిన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వారి కోటాలో మీరా వ్యాక్సిన్ తీసుకున్నట్టు తెలుస్తోంది.
థానేలోని పార్కింగ్ ప్లాజా వ్యాక్సినేషన్ సెంటర్ లో వ్యాక్సిన్ వేయించుకున్న ఆమె.. ఇందుకోసం ఫేక్ ఐడీని ఉపయోగించిందట. ఓంసాయి ఆరోగ్య కేర్ ప్రైవేట్ లిమిటెడ్ లో సూపర్ వైజర్ గా పనిచేస్తున్నట్టు ఓ నకిలీ ఐడీ కార్డును తయారు చేసి, దాన్ని చూపించి వ్యాక్సిన్ తీసుకుందట. ఈ వ్యవహారం బయటకు రావడంతో.. చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది.
ఈ విషయమై థానే మునిసిపల్ కార్పొరేషన్ స్పందించింది. ఇలా చేయడమంటే నిబంధనలను ఉల్లంఘించడమేనని, విచారణకు ఆదేశించామని కార్పొరేషన్ పీఆర్వో సందీప్ మాల్వీ చెప్పారు. ఈ ఆరోపణలు రుజువైతే క్రిమినల్ చర్యలు సైతం తీసుకుంటామని చెప్పారు. కాగా.. ఈ వ్యవహారం రచ్చకెక్కడంతో అప్పటి నుంచి మీడియాను తప్పించుకొని తిరుగుతోందట మీరా. కాగా.. తెలుగులో పవన్ కల్యాణ్ సరసన ‘బంగారం’ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.