Begin typing your search above and press return to search.
రన్ లో సెంచరీ ఆశించని పందెంకోడి గాళ్
By: Tupaki Desk | 13 Dec 2016 7:30 AM GMTసౌత్ లో ట్యాలెంటెడ్ యాక్ట్రెస్ లతో ఓ లిస్ట్ తయారు చేస్తే.. మలయాళీ కుట్టి మీరా జాస్మిన్ పేరు టాప్ 5 లోనే ఉంటుంది. ఎంతటి ట్యాలెంట్ ఉన్నా.. ఎన్ని క్రేజీ ఆఫర్స్ వెంటపడ్డా.. ఈమె మాత్రం కెరీర్ పై పెద్దగా శ్రద్ధగా పెట్టలేదనే విమర్శలున్నాయి. మీరా జాస్మిన్ నటించిన వాటిలో దాదాపు సగం సినిమాలకు అవార్డ్ అందుకుందంటే ఈ భామ ప్రతిభ ఏ పాటిదో అర్ధమవుతుంది. అయితే.. తాను నిర్ణయించుకున్న కెరీర్ పై పూర్తి సంతృప్తిగా ఉన్నానంటోంది మీరా.
మాధవన్ మూవీ రన్ తో తెలుగోళ్లకు దగ్గరైన మీరా.. 'నాకు నాదైన సమయం కావాలని కోరుకుంటా. షూటింగ్ లో ఉన్నా అంతే. నా పని చేసుకుంటాతప్ప ఇతరుల పని పట్టించుకోను. నేనేం చేయాలో వేరేవాళ్లు ఎలా నిర్ణయిస్తారు. నా కెరీర్ ఏదో అర్ధాంతరంగా ఆగిపోయిందని చాలామంది బాధపడుతుంటారు. నేను చేసిన దానికి 100 పర్సెంట్ హ్యాపీగా ఉన్నాను. ఒకసారి ఒక పాత్ర చేస్తే.. మళ్లీ అదే టైపు రోల్ చేయడానికి నాకు మనసు ఒప్పదు. అయినా వంద సినిమాలు చేసి సెంచరీ కొట్టేయాలని నేనెప్పుడూ అనుకోలేదు అంటోంది' పందెంకోడి బ్యూటీ.
17 ఏళ్ల వయసులోనే సినిమాలు ప్రారంభించిన తనకు.. పెళ్లి తర్వాత నచ్చిన పనులు చేసుకునే అవకాశం వచ్చిందని చెబుతోంది. మ్యూజిక్.. మూవీస్.. ఫ్రెండ్స్.. ట్రావెలింగ్ లాంటివి సాధ్యమయ్యాయని అంటోంది మీరా జాస్మిన్. సినిమాల్లో ఉన్నపుడు కూడా దేశవిదేశాలు చుట్టొచ్చినా.. షూటింగ్ తో అలసిపోయాక ఇక ఎంజాయ్ ఎలా చేస్తానని చెబుతోంది. ఇప్పుడు ఒకటీ అరా మలయాళ మూవీస్ మాత్రమే చేస్తున్నా.. ఇప్పుడు చాలా రిలాక్సెడ్ గా సంతోషంగా ఉన్నానని చెబుతోంది మీరా జాస్మిన్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/