Begin typing your search above and press return to search.
క్రిమినల్స్ తో తమిళనాడు పోలీసుల స్నేహమన్న నటి
By: Tupaki Desk | 11 Oct 2019 6:32 AM GMTతరచూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ ఉంటే నటీమణులు సైతం కోలీవుడ్ నటి మీరా మిథున్ ముందు బాలాదూరేనని చెప్పాలి. నోటికి వచ్చినట్లు మాట్లాడటం ఈ మధ్యన కొందరు ప్రముఖులకు అలవాటుగా మారింది. సోషల్ మీడియా పుణ్యమా అని.. తమ మనసుకు అనిపించిన వ్యాఖ్యల్ని పోస్ట్ చేసేస్తున్న వైనం అంతకంతకూ ఎక్కువ అవుతోంది.
ఇటీవల కాలంలో పలు వివాదాలకు సంబంధించి మీరా పేరు వినిపించింది. బ్యూటీ కాంటెస్ట్ లో అవార్డు గెలుచుకున్నప్పటికీ.. ఆమె చేసిన తప్పుతో దాన్ని వెనక్కి తీసుకున్నారు. అంతేకాదు.. అందాల పోటీ నిర్వహిస్తానంటూ పలువురి దగ్గర అడ్వాన్లు తీసుకొని మోసం చేశారంటూ పలువురు ఫిర్యాదులతో చిక్కుల్లో పడ్డారు.
తరచూ వార్తల్లో దర్శనమిచ్చే నటి మీరాకు బిగ్ బాస్ లోనూ ఛాన్స్ వచ్చింది. అయితే..దీని ద్వారా చేరన్ పై పరువునష్టం దావా వేసిన ఫిర్యాదు నేపథ్యంలో ఆమెను ఆ షో నుంచి తొలగించారు. ఇలా వివాదాలతో నిత్యం చెట్టాపట్టాలేసుకొని తిరిగేటట్లుగా వ్యవహరించే ఆమె తాజాగా తమిళనాడు పోలీసులపై ఊహించని రీతిలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
తమిళనాడు రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించినట్లుగా పేర్కొన్న ఆమె.. నేరస్తులతో తమిళనాడు పోలీసులు స్నేహం చేస్తున్నట్లుగా పేర్కొని సంచలనంగా మారారు. పోలీస్ శాఖపై ఆమె చేస్తున్న విమర్శలు కలకలాన్ని రేపుతున్నాయి.
అన్నాడీఎంకే అధినేత్రి.. ఉక్కుమహిళ జయలలిత మరణం తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయన్న ఆమె.. చదువుకున్న వారు రాష్ట్రాన్ని పాలించాలన్నారు. రాజకీయ నేతగా ఉండేందుకు ఇదే పెద్ద అర్హత అన్న ఆమె.. రాష్ట్రంలో అంతకంతకూ తగ్గుతున్న శాంతిభద్రతలపై సీఎం దృష్టి సారించాలన్నారు.
తాను ఇచ్చిన ఫిర్యాదులపై పోలీస్ కమిషనర్ తో సహా ఏ పోలీసు అధికారి చర్యలు తీసుకోవటం లేదని ఆమె తప్పు పట్టారు. పోలీసుల తీరుతో మనోవేదనకు గురైనట్లు పేర్కొన్న ఆమె మాటలు చూస్తుంటే.. కోపంతోనే ఇంత భారీ నింద వేశారా? అన్న అనుమానం కలుగక మానదు.