Begin typing your search above and press return to search.
ఆ రెండు కోలీవుడ్ స్టార్స్ సక్సెస్ సీక్రెట్స్
By: Tupaki Desk | 7 Aug 2020 12:30 AM GMTకోలీవుడ్ శ్రీరెడ్డిగా ఈమద్య కాలంలో మీరా మిథున్ ను అంటున్నారు. త్రిష నుండి మొదలు పెట్టి సూర్య విజయ్ ల వరకు ఎంతో మంది స్టార్స్ ను టార్గెట్ చేసి ఆమె విమర్శలు చేస్తూనే వస్తోంది. గత ఏడాది బిగ్ బాస్ లో పాల్గొన్న సమయంలో ఆమెకు ఇంతగా పాపులారిటీ లేదు. ఎప్పుడైతే త్రిష తనను ఫాలో అవుతుందని విజయ్ సూర్యల అభిమానులపై విమర్శలు చేసిందో అప్పటి నుండి ఈమె సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యింది. తాజాగా ఈమె కోలీవుడ్ లో నెపొటిజంపై స్పందించింది. ఇన్ని రోజులు స్టార్స్ ను విమర్శించేలా మాట్లాడిన ఈమె ఈసారి మాత్రం కాస్త విభిన్నంగా మాట్లాడి ఆశ్చర్యపర్చింది.
సినిమా ఇండస్ట్రీలో ముఖ్యంగా కోలీవుడ్ లో స్టార్స్ గా పేరు దక్కించుకోవాలంటే కేవలం వారసులు అయితే సరిపోదు అంది. వారసులు కాని వారు కూడా తమిళ ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అయ్యారు అంది. ఈమద్య కాలంలో కొందరు నెపొటిజం గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. సినిమా ఇండస్ట్రీలో బంధు ప్రీతితో వచ్చినంత మాత్రాన కష్టపడకుండా మాత్రం సక్సెస్ రాదని మీరా అభిప్రాయం వ్యక్తం చేసింది.
తమిళ సినిమా పరిశ్రమలో సక్సెస్ దక్కించుకోవాలంటే తప్పకుండా కఠోర శ్రమ మరియు కాస్త అదృష్టం మాత్రం తప్పనిసరి అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అజిత్ ఇంకా విజయ్ లు అదృష్టంను కలిగి ఉండటంతో పాటు ఎంతో శ్రమ పడటం వల్లే ఈ స్థాయికి వచ్చారు. వారిలాగే ఇంకా తమిళ ఇండస్ట్రీలో కష్టపడి పైకి వచ్చిన వారు ఉన్నారు. ప్రతిభ లేని వారు ఇండస్ట్రీలో బంధువులు ఉన్నంత మాత్రాన సక్సెస్ అయిన దాఖలాలు లేవంటూ మీరా మిధున్ చెప్పుకొచ్చింది.