Begin typing your search above and press return to search.
ఈమె కోలీవుడ్ శ్రీరెడ్డి లా మారింది
By: Tupaki Desk | 15 July 2020 10:30 AM GMTటాలీవుడ్ సినీ ప్రముఖులకు కొంత కాలం పాటు తన వ్యాఖ్యలతో తీవ్ర ఇబ్బంది కలిగించిన శ్రీరెడ్డి ఈమద్య కాస్త సైలెంట్ అయ్యింది. స్టార్స్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే స్టార్స్ అవ్వొచ్చు అనేది శ్రీరెడ్డి ఉదంతంతో నిరూపితం అయ్యింది. శ్రీరెడ్డిని ఆదర్శంగా తీసుకుందో లేక మరేంటో కాని కోలీవుడ్ నటి.. బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన మీరా మిథున్ స్టార్స్ పై వరుసగా కామెంట్స్ చేస్తోంది. కంగనా రనౌత్.. త్రిషలను టార్గెట్ చేసిన మీరా మిథున్ ఇప్పుడు ఏకంగా సూపర్ స్టార్స్ రజినీకాంత్ విజయ్ లపై విమర్శలకు దిగింది.
జయలలిత బయోపిక్ చేసే అధికారం నీకు ఎక్కడిది అంటూ కంగనా రనౌత్ ను ప్రశ్నించి అందరి దృష్టిని ఆకర్షించిన ఈమె ఇటీవల త్రిషను కూడా టార్గెట్ చేసింది. నేను అనుసరిస్తున్న విధానాలను త్రిష కాపీ కొడుతుందని.. నన్ను ఫాలో అవుతున్న త్రిష నాకు సారీ చెప్పాలంటూ డిమాండ్ చేసింది. మీరా పై నెటిజన్స్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. సంచలనం కోసం ఏది పడితే అది మాట్లాడవద్దంటూ ఆమెను హెచ్చరించారు. తాజాగా మరోసారి ఆమె సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
కర్ణాటకకు చెందిన రజినీకాంత్ మరియు క్రిస్టియన్ అయిన విజయ్ లు నన్ను తొక్కేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కోలీవుడ్ చాలా కాలం క్రితమే నన్ను బహిష్కరించింది. అందుకు నేను కృతజ్ఞతలు చెప్తాను. ఎందుకేంటే నాకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు వచ్చాయి. మలయాళీలు మరియు క్రిస్టియన్స్ డామినేషన్ ఎక్కువ అవుతున్న నేపథ్యంలో నాలాంటి వారికి అన్యాయం జరుగుతుందని మీరా మిథున్ పేర్కొంది. తాజా కామెంట్స్ తో ఆమెను నెటిజన్స్ మరింతగా ట్రోల్స్ చేస్తున్నారు.