Begin typing your search above and press return to search.

బ్లూ బికినీలో హీరో గారి వైఫ్ అదిరే ఫోజ్

By:  Tupaki Desk   |   4 Jan 2023 8:08 AM GMT
బ్లూ బికినీలో హీరో గారి వైఫ్ అదిరే ఫోజ్
X
బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ ..ఆయ‌న స‌తీమ‌ణి మీరా రాజ్ పుత్ సన్నిహితులతో అన్ నోన్ లొకేష‌న్ లో నూతన సంవత్సర వేడుకలను జ‌రుపుకున్నారు. సోమవారం సాయంత్రం మీరా తన ఇన్ స్టాలో వ‌రుస ఫోటోలను షేర్ చేయ‌గా అవి నెటిజ‌నుల్లో చ‌ర్చ‌గా మారాయి. ఓ ఫోటోలో వెల్ నెస్ ఔత్సాహికురాలు మీరా నీలిరంగు బ్యాక్ లెస్ స్విమ్ సూట్ (మోనోకిని)లో బీచ్ లో సూర్యాస్తమయాన్ని ఆస్వాధిస్తూ క‌నిపించింది. సముద్రానికి ఎదురుగా నిలిచి బ్లూ వాట‌ర్ ని వీక్షిస్తున్న‌ట్టు కనిపించింది. అభిమానులు మీరా ఆత్మ‌విశ్వాసానికి హ్యాట్సాప్ చెప్పారు. ఫోటోల బంచ్ లో సుందరమైన ప్రకృతి సౌందర్యం ఎంతో బావుంద‌ని కితాబిచ్చారు.

మరొక ఫోటోలో షాహిద్ తన భార్య మీరా ఇత‌ర స్నేహితులతో క‌లిసి బీచ్ సెల్ఫీని తీసుకుంటూ కనిపించాడు. మీరా అదే నీలి రంగు స్విమ్ సూట్ లో అద్భుతంగా కనిపించింది. నారింజ ఫ్రేమింగ్ తో పొడవాటి షెల్ నెక్లెస్ - ఓవల్ షేడ్స్ తో మీరా లుక్ గుబులు పుట్టించింది. మరోవైపు షాహిద్ ఎప్పటిలాగే ఫంకీ ప్రింటెడ్ షర్ట్ - బ్లాక్ గాగుల్స్ లో డాషింగ్ గా కనిపించాడు.

ఈ పోస్ట్ కు క్యాప్షన్ ఇచ్చిన‌ మీరా వాటర్ వేవ్ ఎమోజితో ''ఉప్పగా ఉండే జుట్టు.. ఇసుక దేహం'' అంటూ ఒక ఫ‌న్నీ నోట్ ని రాసింది. మీరా- షాహిద్ జంట‌ బీచ్ లో ఒకరినొకరు కౌగిలించుకుని పోజులిచ్చిన ఫోటో ఆక‌ట్టుకుంది. 'వెయిటింగ్ ఫర్ యు 2023' అంటూ దీనికి క్యాప్ష‌న్ ఇచ్చారు.

బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ -అతని భార్య మీరా రాజ్‌పుత్ బీచ్ వెకేషన్ ఆస్వాధ‌న ఇప్పుడు అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా మీరా లావెండర్ మోనోకినిలో టూ హాట్ గా ఉందంటూ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.

షాహిద్ క‌పూర్ సెల్ఫ్ మేడ్ స్టార్. బాలీవుడ్ లో ఖాన్ ల హ‌వా సాగుతున్న రోజుల్లోనే అద్భుత ఫాలోయింగ్ ని ఆస్వాధించిన యువ‌హీరో. ప‌లువురు క‌థానాయిక‌ల‌తో ఎఫైర్ల‌ను జోరుగా సాగించాడు. న‌టి క‌రీనా క‌పూర్ ని పెళ్లాడేస్తాడ‌ని టాక్ కూడా వినిపించినా చివ‌రికి బ్రేక‌ప్ అయ్యారు.

దిల్లీ రాకుమారి మీరా రాజ్ పుత్ ని పెళ్లాడాక అత‌డి స్టైల్ మొత్తం మారింది. ప‌క్కా ఫ్యామిలీ మ్యాన్ గా ఫిలింస‌ర్కిల్స్ సహా అభిమానుల్లో మ‌న్న‌నలు అందుకుంటున్నాడు. షాహిద్ కొత్త సంవ‌త్స‌రంలో వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్నాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.