Begin typing your search above and press return to search.
నాని నిర్మాణంలో 'మీట్ క్యూట్' మూవీ షూటింగ్ ప్రారంభం..!
By: Tupaki Desk | 14 Jun 2021 12:30 PM GMTవాల్ పోస్టర్ సినిమా బ్యానర్ ను స్థాపించిన నేచురల్ స్టార్ నాని.. 'అ!' 'హిట్' వంటి కంటెంట్ బేస్డ్ చిత్రాలు రూపొందించి నిర్మాతగా సక్సెస్ అయ్యారు. ఇటీవలే 'హిట్' చిత్రానికి సీక్వెల్ గా 'హిట్ 2' చిత్రాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో తాజాగా తన ప్రొడక్షన్ లో నాల్గవ సినిమాని ప్రకటించారు. నిర్మాత తిపిర్నేని ప్రశాంతి తో కలిసి “మీట్ క్యూట్” అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు నాని.
'మీట్ క్యూట్' ఒక కంటెంట్ డ్రివెన్ విమెన్ సెంట్రిక్ మూవీ అని తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ - శైలేష్ కొలను వంటి ప్రతిభావంతులైన దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేసిన నాని.. ఈ సినిమాతో దీప్తి ఘంట అనే లేడీ డైరెక్టర్ ను ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ప్రముఖ కథానాయికలు లీడ్ రోల్ లో నటించనున్న ఈ క్రేజీ మల్టీస్టారర్ మూవీలో సీనియర్ నటుడు సత్యరాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
హైదరాబాద్ లో ఈరోజు సోమవారం 'మీట్ క్యూట్' చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశం కోసం సత్యరాజ్ పై నాని స్వయంగా క్లాప్ కొట్టారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించిన నాని.. “వాల్ పోస్టర్ సినిమా ప్రొడక్షన్ నెం.4 మీట్ క్యూట్. ఈ రోజు కొత్త ప్రయాణం ప్రారంభమవుతుంది. ఇది ఒకటి కంటే ఎక్కువ కారణాల వల్ల ప్రత్యేకమైనది'' అని పేర్కొన్నారు.
'మీట్ క్యూట్' చిత్రానికి వసంత కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. విజయ్ బుల్గానిన్ సంగీతం సమకూరుస్తున్నారు. అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తుండగా.. గ్యారీ బిహెచ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రధాన తారాగణం మరియు ఇతర వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.