Begin typing your search above and press return to search.

టాలీవుడ్ ప్రొడ్యూస‌ర్స్ కీల‌క భేటీ.. ఏం నిర్ణ‌యించ‌బోతున్నారు?

By:  Tupaki Desk   |   25 July 2022 9:34 AM GMT
టాలీవుడ్ ప్రొడ్యూస‌ర్స్ కీల‌క భేటీ.. ఏం నిర్ణ‌యించ‌బోతున్నారు?
X
గ‌త కొంత కాలంగా క‌రోనా కార‌ణంగా సినిమాలు చాలా వ‌ర‌కు ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాయి. షూటింగ్ లు నిలిచి పోవ‌డంతో నిర్మాత‌ల‌కు నిర్మాణ భారం పెరిగిపోయింది. దీనికి తోడు థియేట‌ర్లు తెరుచుకోక పోవ‌డంతో చాలా వ‌ర‌కు సినిమాల‌ని ఓటీటీల‌కు ఇచ్చేశారు. అయితే ఇప్ప‌డు అదే ఓటీటీలు థియేట‌ర్ వ్య‌వ‌స్థ‌ని ప్ర‌శ్నార్థ‌కంలో ప‌డేస్తున్నాయి. అంతే కాకుండా తాజాగా నిర్మాణ వ్య‌యం పెర‌గ‌డం, టికెట్ రేట్లు పెంచ‌డంతో స‌గ‌టు ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు రాక‌పోవ‌డంతో చాలా వ‌ర‌కు సినిమాలు న‌ష్టాల బాట ప‌ట్టాయి.

రెండు, మూడు వారాల త‌రువాత ఓటీటీలో సినిమాలు చూడొచ్చులే అనే మైండ్ సెట్ కి ఆడియ‌న్ రావ‌డంతో చాలా వ‌ర‌కు సిరిమాలు రెండు వారాల‌కు మించి థియేట‌ర్ల‌లో నిల‌బ‌డ‌లేని ప‌రిస్థితులు ఎదుర‌వుతున్నాయి. దీనికి ప్ర‌ధాన కార‌ణంగా పెంచిన టికెట్ రేట్లే. దీనితో పాటు ఓటీటీల‌కు సినిమాల‌ని ఎన్నివారాల త‌రువాత ఇవ‌వ్వాల‌నే దానిపై చాలా రోజులుగా త‌ర్జ‌న బ‌ర్జ‌న ప‌డుతున్న నిర్మాత‌లు సోమ‌వారం కీల‌క నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టుగా తెలుస్తోంది.

సోమ‌వారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు వివిధ అంశాల‌పై ప్ర‌త్యేకంగా నిర్మాత‌ల మండ‌లి భేటీ కాబోతోంది. అంతే కాకుండా ఈ నెల 26న కూడా ప్ర‌ధాన నాలుగు విభాగాలు నిర్మాత‌లు, పంపిణీ దారులు, ఎగ్జిబిట‌ర్లు, స్టూడియో నిర్వాహ‌కులు ప్ర‌త్యేకంగా స‌మావేశం కానుట్టుగా తెలిసింది. ఈ నేప‌థ్యంలో వారు తీసుకోబోతున్న నిర్ణయాలు తాజాగా బ‌య‌టికి వ‌చ్చాయి. ఆగ‌స్టు 1 నుంచి షూటింగ్ లు నివ‌ర‌ధికంగా నిలిపివేయబోతున్నార‌నే వార్త‌ల నేప‌థ్యంలో నిర్మాత‌ల మండ‌లి ప్ర‌త్యేకంగా సోమ‌వారం భేటీ కానుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

అంతే కాకుండా షూటింగ్ ల నిలుపుద‌ల‌పై ఎలాంటి పుకార్ల‌ని న‌మ్మ‌వ‌ద్ద‌ని, దీనిపై స‌రైన నిర్ణ‌యం రాబోతోంద‌ని కార్య‌ద‌ర్శులు ప్ర‌స‌న్న‌కుమార్‌, మోహ‌న్ వ‌డ్ల‌ప‌ట్ల ఓ ప్ర‌క‌ట‌నతో వెల్ల‌డించారు. అయితే ప్ర‌స్తుతం సినిమా రంగం తీవ్ర సంక్షోభంలో వుంద‌ని, స్టార్ హీరోల సినిమాకు సైతం ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు రాలేని ప‌రిస్థితులు త‌లెత్తాయ‌ని కొంత మంది నిర్మాత‌లు వాపోతున్నారు. పెరిగిన నిర్మాణ వ్య‌యంని క‌ట్ట‌డ‌చేయ‌లేక‌పోతున్నామ‌ని, ఈ నేప‌థ్యంలో ప్రేక్ష‌కుల నుంచి సినిమాల‌కు స్పంద‌న క‌రువు అవుతోంద‌ని ప్ర‌స్తుతం నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌ని ప‌రిష్క‌రించుకున్న త‌రువాతే షూటింగ్ లు తిరిగి ప్రారంభించాల‌ని యాక్టివ్ ప్రొడ్యూస‌ర్స్ భావిస్తున్నార‌ట‌.

కానీ నిర్మాత‌ల మండలి మాత్రం అందుకు తాము వ్య‌తిరేక‌మ‌ని చెబుతోంది. అంతే కాకుండా తాజాగా కొన్ని కిలీక నిర్ణ‌యాల‌ని ప్ర‌క‌టించ‌బోతున్న‌ట్టుగా తెలుస్తోంది. ఓటీటీలో సినిమాల రిలీజ్ ల‌కు కొత్త రూల్స్ ని అమ‌లు చేయ‌బోతోంద‌ని తెలిసింది. కూ. 6 కోట్ల లోపు బ‌డ్జెట్ వున్న సినిమాల స్ట్రీమింగ్ కు 4 వారాలు, భారీ బ‌డ్జెట్ సినిమాల స్ట్రీమింగ్ కు 10 వారాల గ్యాప్ ఇవ్వాల‌ని తీర్మానించింద‌ని తెలిసింది. అంతే కాకుండా టికెట్ల ధ‌ర‌ల‌ని కూడా ప్ర‌త్యేకంగా నిర్ణ‌యించిన‌ట్టుగా తెలుస్తోంది.

చిన్న సినిమాల‌కు ఏబీ సెంట‌ర్ల‌లో రూ.100, మ‌ల్టీప్లెక్స్‌ల‌లో రూ.125, సీ సెంట‌ర్ల‌లో రూ. 70, మ‌ల్టీప్లెక్స్ ల‌లో రూ.125, మినిమ‌మ్ బ‌డ్జెట్ సినిమాల‌కు ఏబీ సెంట‌ర్ల‌లో సింగిల్ స్క్రీన్ థియేట‌ర్ల‌లో రూ.112, మ‌ల్టీప్లెక్స్ ల‌లో రూ. 177, సీ సెంట‌ర్ల‌లో సింగిల్ స్క్రీన్ థియేట‌ర్ల‌లో రూ. 100, మ‌ల్టీప్లెక్స్ ల‌లో రూ. 177గా నిర్ణ‌యించార‌ట‌. ఇక బిగ్ బ‌డ్జెట్ సినిమాల‌కు ఏబీ సెంట‌ర్ల‌లో సింగిల్ స్క్రీన్ థియేట‌ర్ల‌లో రూ.177, మ‌ల్టీప్లెక్స్ ల‌లో రూ. 295, సీ సెంట‌ర్ల‌లో సింగిల్ స్క్రీన్ థియేట‌ర్ల‌లో రూ.150, మ‌ల్టీప్లెక్స్ ల‌లో రూ. 295గా నిర్ణ‌యించార‌ట‌. ఈ కొత్త రూల్స్ ని తెలంగాణ ఫిలిం ఛాంబ‌ర్ తాజా రేట్ల‌ని ఆగ‌స్టు 1 నుంచి అమ‌ల్లోకి తీసుకురానున్నార‌ట‌. ఈ రేట్లు క‌రెక్ట్ గా అమ‌ల‌వుతాయా లేక మ‌ళ్లీ అంకెల‌కే ప‌రిమితం అవుతాయా? అన్న‌ది వేచి చూడాల్సిందే.