Begin typing your search above and press return to search.

సీఎం జ‌గ‌న్ తో నే భేటి: దిల్ రాజు..అర‌వింద్..సురేష్ బాబు లైట్!

By:  Tupaki Desk   |   10 Feb 2022 4:31 AM GMT
సీఎం జ‌గ‌న్ తో నే భేటి:  దిల్ రాజు..అర‌వింద్..సురేష్ బాబు లైట్!
X
తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో మరికొన్ని గంటల్లో స‌మావేశం కానున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ భేటీకి ఎవ‌రు హాజ‌ర‌వుతున్నారు? అన్న‌ది స‌స్పెన్స్ గా మారింది.

టిక్కెట్ ధ‌ర‌ల విష‌యంలో జీవో నెంబ‌ర్ 35 అమ‌లులోకి తీసుకొచ్చిన త‌ర్వాత ఇండ‌స్ర్టీ త‌రుపున నిర్మాత‌ దిల్ రాజు..సునీల్ నారంగ్..మైత్రీ మూవీ మేక‌ర్స్ అధినేత‌లు వంటివారు ప‌లు ద‌ఫాలుగా చ‌ర్చ‌లు జ‌రిపినా ఫ‌లించ‌లేదు. ప్ర‌భుత్వం ప‌ట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రించింది. మంత్రి పేర్ని నానితో స‌మావేశాల్లో ఎలాంటి పురోగ‌తి క‌నిపించ‌ని సంగ‌తి తెలిసిందే.

వాస్త‌వానికి ఈ స‌మావేశాల‌కు ఇండస్ర్టీ నుంచి అగ్ర నిర్మాత‌లైన సురేష్ బాబు..అల్లు అర‌వింద్ లాంటి వారు తొలి నుంచి హాజ‌రు కాలేదు. అర‌వింద్ ఓ వేదిక పై మాత్రం సీఎంని అభ్య‌ర్దించే ప్ర‌య‌త్నం చేసారు. దేవుడు త‌లుచుకుంటే వ‌రాలు క‌రువా? అని సీఎంని ఉద్దేశించి త‌మ స‌మ‌స్య‌ల‌పై దృష్టి నిల‌పాల‌ని చెప్పే ప్ర‌య‌త్నం చేసారు. అంత‌కు ముందు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎపిసోడ్ స‌హా ప‌లు అంశాల నేప‌థ్యంలో ఇండ‌స్ర్టీ వేరు? ప్ర‌భుత్వ విధానాలు వేరుగా ఫోక‌స్ అయింది. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ ఇచ్చారు. నేరుగా చిరంజీవి సీఎంతో భేటి అవ్వ‌డం మీడియా స‌మావేశంలో ప్ర‌భుత్వం ప‌రిశ్ర‌మ ప‌ట్ల సానుకూలంగా ఉంద‌ని వెల్ల‌డించ‌డంతో అన్ని స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం దొరికిన‌ట్లేన‌ని అనిపించింది.

అయితే నిన్న‌టి రోజున ప్ర‌భుత్వం వేసిన క‌మిటీ రిపోర్ట్ టిక్కెట్ ద‌ర‌ల విష‌యంలో సినిమా వాళ్ల‌కు అనుకూలంగా ఉంద‌ని ప్ర‌చారం సాగింది. దీనిపై సినిమాటోగ్ర‌ఫీ మంత్రి పేర్ని నాని మీడియా వ్యాఖ్య‌ల్లో అస్ప‌ష్ట‌త క‌నిపించింది. ముసాయిదా నివేదిక నేరుగా చిరంజీవి ఆఫీస్ కి వెళ్లిఉండొచ్చేమో! అన‌డం.. త‌మ్మారెడ్డి భ‌ర‌త్వాజ చాంబ‌ర్ ప్ర‌తినిధుల్ని కూడా పిలిస్తే బాగుంటుంద‌ని సూచించ‌గా దానికి మంత్రి నాని ఏవైనా అంశాలు ఉంటే నాతో మాట్లాడితే సానుకూలంగా చ‌ర్చిస్తాన‌న‌డం వంటి వ్యాఖ్య‌లో అస్ప‌ష్టంగా..అప‌హేళ‌న‌గా ఉన్నాయ‌ని కొంత భావిస్తున్నారు. ఇలాంటి ప‌రిణామాల నేప‌థ్యంలో నేటి సీఎం భేటీకి ఎవ‌రెవ‌రు హాజ‌ర‌వుతున్నారు? అన్న‌ది క్లారిటీ లేదు.

నిర్మాత‌లు దిల్ రాజు...సురేష్ బాబు ..అల్లు అర‌వింద్ వెళ్ల‌లేద‌ని ప్ర‌చారం సాగుతోంది. అల్లు ఫ్యామిలీ నుంచి బాబి వెళ్తున్న‌ట్లు స‌మాచారం. అలాగే కొంత మంది హీరోలు.. ఛాంబ‌ర్ ప్ర‌తినిధులు...ప్ర‌భుత్వం- ఇండ‌స్ర్టీ మ‌ధ్య స‌యోధ్య కుదిర్చే వ‌ర్గం మాత్రమే త‌ప్ప‌క హాజ‌ర‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఇక్క‌డ ప్ర‌ధానంగా హాజ‌రు కావాల్సింది దిల్ రాజు...సురేష్ బాబు..అల్లు అర‌వింద్. ఏపీలో థియేట‌ర్ల వ్య‌వ‌స్థ వీళ్ల చేతుల్లోనే ఉంది. సినిమా టిక్కెట్ ధ‌ర‌ల‌పై ముందుగా స్పందించింది కూడా ఈ ముగ్గురే. కానీ ఇప్పుడు వాళ్లు మౌనం వ‌హించ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌కు దారి తీస్తోంది. ఈ వైఖ‌రి నేప‌థ్యంలో ప్ర‌భుత్వం తో సంబంధం లేకుండా త‌మ సినిమాల్ని నేరుగా ఓటీటీ లో రిలీజ్ చేసుకోవ‌చ్చు అనే ధీమాతోనే ఉన్నారా? అని సందేహం వ్య‌క్తం అవుతుంది.

అయితే ఇండ‌స్ర్టీ పెద్ద‌లు ప్ర‌భుత్వం తో సానుకూలంగా ముందుకు వెళ్లాల‌ని ఎంత‌గానో ప్ర‌య‌త్నించి చివ‌రికి విసుగు చెందే స‌ద‌రు నిర్మాత‌లు మౌనం దాల్చుతున్నార‌ని.. అందుకే మెగాస్టార్ చిరంజీవి ఈ మొత్తం వ్య‌వ‌హారం త‌న నెత్తిన వేసుకున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి నేటి భేటి ముగిస్తే గానీ వీట‌న్నింటిపై ఫుల్ క్లారిటీ రాదు.