Begin typing your search above and press return to search.
మెగా-అల్లు బంధం మళ్లీ బలపడినట్లేనా..??
By: Tupaki Desk | 27 Jun 2022 11:30 PM GMTమెగా ఫ్యామిలీలో చీలికలు వచ్చాయని.. అల్లు కాంపౌండ్ కి మెగా కాంపౌండ్ కి మధ్య సంబంధాలు అంతగా బాగా లేవని చాలా కాలంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అల్లు ఫ్యామిలీ 'మెగా' ముద్ర తొలగించుకోవాలని ప్రయత్నం చేస్తోందని రూమర్స్ వినిపించాయి. ఇక సోషల్ మీడియాలో మెగా vs అల్లు ఫ్యాన్ వార్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఇటీవల విజయవాడలో జరిగిన ఆల్ ఇండియా చిరంజీవి ఫ్యాన్స్ ప్రైవేట్ మీట్ లో కొందరు యూనియన్ సభ్యులు అల్లు అర్జున్ ను ఉద్దేశిస్తూ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. దీంతో అల్లు-మెగా అభిమానుల మధ్య నెట్టింట పెద్ద రచ్చ జరిగింది. ఈ నేపథ్యంలో అల్లు ఫ్యామిలీకి చెందిన గీతా ఆర్ట్స్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అల్లు అరవింద్ సమర్పణలో మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'పక్కా కమర్షియల్'. రిలీజ్ కు రెడీ అయిన ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. దీనికి చిరు చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. మెగా ప్రొడ్యూసర్ తో కలిసి ఒకే వేదికను పంచుకొని తమ మధ్య అన్నీ పరిష్కరించబడ్డాయని చెప్పే ప్రయత్నం చేశారు.
వాస్తవానికి 'పక్కా కమర్షియల్' ప్రీ-రిలీజ్ ఈవెంట్ మెగా-అల్లు బ్యాచ్ రీయూనియన్ పార్టీలా కనిపించిందని కామెంట్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఇందులో గోపీచంద్ సినిమాను ప్రమోట్ చేసినట్లు అనిపించలేదు. అల్లు క్యాంప్ గా ముద్రపడిన బన్నీ వాస్ - మారుతీ - ఎస్‌కెఎన్ వంటివారు మెగాస్టార్ ను పొగిడితే.. వారందరిని చిరు గొప్పగా ప్రశంసించారు.
మెగా-అల్లు క్యాంపుల మధ్య అంతా బాగుందని అందరికీ చాటిచెప్పడానికే అల్లు అరవింద్ ఈ ఈవెంట్ కి చిరంజీవిని తీసుకురావాలనే ప్లాన్ చేసినట్లు అనిపిస్తోంది. ఇందులో భాగంగానే అంతకుముందు మెగాస్టార్ ను ఆహా షోకి గెస్టుగా పిలిచారు. ఈ రెండింటి విషయంలో సీనియర్ నిర్మాత ప్లాన్స్ బాగానే వర్కౌట్ అయినట్లు కనిపిస్తోంది.
'పక్కా కమర్షియల్' ఈవెంట్ వేదికగా మెగా-అల్లు బంధం బలంగానే ఉందనే సంకేతాలు ఇచ్చారు. మరోవైపు సినిమాకు కావాల్సిన బజ్ తీసుకురాగలిగారు. ఎలా చూసుకున్నా ఈ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయిందనే అనుకోవాలి. ఇరు వర్గాల ఫ్యాన్స్ కూడా శాంతించి ఎప్పటిలాగే కలిసిపోతారేమో చూడాలి.