Begin typing your search above and press return to search.

పెళ్లి వేడ‌క‌లో మెరిసిన మెగా బ్ర‌ద‌ర్స్

By:  Tupaki Desk   |   25 Oct 2021 4:15 AM GMT
పెళ్లి వేడ‌క‌లో మెరిసిన మెగా బ్ర‌ద‌ర్స్
X
తాము అభిమానించే ఇద్ద‌రు స్టార్‌ లు ఒకేచోట క‌లిస్తే చూడ‌టానికి ఆ కిక్కే వేరుగా వుంటుంది. అదే ఇద్ద‌రు స్టార్‌ లైన అన్నా ద‌మ్ములు ఒకే చోట క‌లిసి ఒకే ఫ్రేమ్‌ లో క‌నువిందు చేస్తే ఆ దృశ్యం చూడ‌ముచ్చ‌ట‌గా వుంటుంది. అలాంటి దృశ్య‌మే తాజాగా ఓ రాజ‌కీయ నాయ‌కుడి కుమారుడి పెళ్లి వేడుక‌లో సాక్షాత్కార‌మైంది. వివ‌రాల్లోకి వెళితే...ర‌క్షాబంధ‌న్ టైమ్‌ లో మెగా ఫ్యామిలీకి సంబంధించిన మెగా బ్ర‌ద‌ర్స్ అంతా ఒక్క చోట చేరి అభిమానుల‌కు క‌నువిందు చేశారు.

మెగాస్టార్ ఇంటికి ప‌వ‌ర్‌ స్టార్‌.. నాగ‌బాబు చేరి సంద‌డి చేశారు. ప‌వ‌న్‌ క‌ల్యాణ్ అయితే త‌న వ‌దిన సురేఖ‌తో కామెడీ చేయ‌డం ... ఏమండీ సురేఖ గారూ బాగున్నారా? .. అంటూ వ‌దిన‌మ్మ‌ని ఆట‌ప‌ట్టించ‌డం అభిమానుల‌తో పాటు సాధార‌ణ ప్రేక్ష‌కుల్ని కూడా విశేషంగా ఆక‌ట్టుకుంది.ఈ దృశ్యాన్ని చూసి మెగాస్టార్ చిరంజీవి ఆనందంతో ముసి ముసి న‌వ్వుల్లో తేలిపోయారు. తాజాగా త‌న సోద‌రుడు ప‌వ‌న్‌ క‌ల్యాణ్‌ తో క‌లిసి రాజ‌కీయ నాయ‌కుడు మండ‌లి బుద్ధ‌ప్ర‌సాద్ త‌న‌యుడి పెళ్లికి హాజ‌రయ్యారు.

ఈ సంద‌ర్భంగా పెళ్లి వేడుక‌లో మెగా బ్ర‌ద‌ర్స్ మ‌ధ్య న‌వ్వులు కురిసాయి. వీరికి సంబంధించిన ఫొటోలు ప్ర‌స్తుతం నెట్టింట సంద‌డి చేస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం వ‌రుస చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా వున్నారు. మ‌రో ప‌క్క ప‌వ‌ర్‌ స్టార్ కూడా వ‌రుస చిత్రాల్లో న‌టిస్తూనే రాజ‌కీయాల్లోనూ బిజీగా గ‌డుపుతున్నారు. మెగాస్టార్ `ఆచార్య‌` చిత్రీక‌ర‌ణ పూర్తి చేసి `భోళా శంక‌ర్‌... గాడ్ ఫాద‌ర్ చిత్రాల‌కు రెడీ అయిపోయారు. ప‌వ‌న్ `భీమ్లా నాయ‌క్` కంప్లీట్ చేసి హ‌రీశ్ శంక‌ర్ సినిమా `భ‌వ‌ధీయుడు భ‌గత్‌ సింగ్‌`కి సిద్ధ‌మ‌వుతున్నారు.