Begin typing your search above and press return to search.

మెగా బ్రదర్స్ వింటేజ్ లుక్.. అదరహో..

By:  Tupaki Desk   |   22 Dec 2022 9:34 AM GMT
మెగా బ్రదర్స్ వింటేజ్ లుక్.. అదరహో..
X
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రతి హీరో కూడా ఫాన్స్ లో అయితే వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపునందుకుంటు వెళుతున్నారు. అయితే ఆ ఫ్యామిలీ నుంచి ఎంతమంది హీరోలు వచ్చినా కూడా మెగాస్టార్ చిరంజీవి వేసిన బాటలను మాత్రం ఎవరు మరువలేరు అని చెప్పవచ్చు. మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ మొదటి నుంచి కూడా ఎన్నో ప్రయోగాత్మకమైన సినిమాలు చేసుకుంటూ ఈ స్థాయిలో గుర్తింపు అందుకున్నారు.

ఇక అదే బాటలో చాలామంది హీరోలు కొనసాగుతున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి తర్వాత మళ్లీ ఆ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోవర్స్ ను సంపాదించుకున్న వారిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ఇద్దరు హీరోలు ఒకే ఫ్రేమ్లో కనిపిస్తే చూడాలని ఎప్పటినుంచో ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారు. అయితే అది మాత్రం అందని ద్రాక్ష లాగే మిగులుతుంది. ఆ మధ్య శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో ఏదో పవన్ కళ్యాణ్ చిన్న పాత్రలో కనిపించినప్పటికీ కూడా పూర్తిస్థాయిలో అయితే ఫాన్స్ ను అది సంతృప్తి పరచలేకపోయింది.

ఇక అప్పుడప్పుడు మెగా హీరోలు ఒకే ఫ్రేమ్లో కనిపించే ఫోటోలు మాత్రం ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటాయి. అప్పట్లో ఫోటోషూట్ అనేది స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉండేది. ఇక మ్యాగజైన్స్ లో కూడా మెగా బ్రదర్స్ ఫోటోలు హైలెట్ గా నిలుస్తూ ఉండేవి.

గతంలో మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి దిగిన ఈ ఫోటో చూస్తే రెండు కనులు సరిపోలేవు అని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ హీరోగా నిలదొక్కుకోవాలని అనుకుంటున్న సమయంలో ఈ తరహాలో తన అన్నయ్యతో కలిసి ఫోటోషూట్స్ చేశాడు.

అప్పట్లో ఈ ఫోటోలకు మంచి క్రేజ్ కూడా దక్కింది. హార్డ్ ఫ్యాన్స్ అయితే ఇలాంటి స్టిల్స్ ఇంకా భద్రంగా దాచుకునే ఉంటారు. ఇక మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో ఒక్క సినిమా పడినా కూడా ఫ్యాన్స్ కు అసలైన పండగ వచ్చినట్లే అని చాలాసార్లు చాలామంది దర్శకులు చెప్పారు.

అయితే గతంలో త్రివిక్రమ్ వీరిద్దరి కోసం ఒక కథను ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నట్లు కూడా ఒక టాక్ అయితే వినిపించింది. అది నిజం కావాలి అని చాలామంది కోరుకున్నారు. కానీ కాలగర్భంలోనే ఆ టాక్ అనేది మాయమైపోయింది. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి అన్నదమ్ములు మళ్ళీ కలిసి సినిమాలు చేస్తారో లేదో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.