Begin typing your search above and press return to search.
శిరీష్ కోసం మెగా కేరింగ్ ఎంతవరకూ?
By: Tupaki Desk | 19 Dec 2019 11:23 AM GMTమెగా వృక్షం నీడలో డజను మంది హీరోలు సేదదీరుతున్న సంగతి తెలిసిందే. అయితే అందులో కొందరు సక్సెస్ స్ట్రీక్ ని కొనసాగిస్తుంటే ఒకరిద్దరు యువహీరోలు మాత్రం స్ట్రగుల్స్ ని ఫేస్ చేస్తున్నారు. అయితే అలాంటి స్ట్రగ్లింగ్ హీరోల విషయంలో మెగాస్టార్ ఇన్వాల్వ్ మెంట్ ఎంత? అంటే... ఆయన సలహా లేనిదే ఏదీ కుదరదన్నది ఫ్యాన్స్ అభిప్రాయం. మెగాస్టార్ సుదీర్ఘ అనుభవంతో ఇచ్చే సలహాలు.. సూచనలు యువహీరోలకు సాయమవుతాయి. అయితే ఎందుకనో ఓ ఇద్దరు ముగ్గరి విషయంలో సరిగా కుదలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇప్పటికే మెగా మేనల్లుడు సాయిధరమ్ కెరీర్ ని బూస్టప్ చేసేందుకు చిరంజీవి- అల్లు అరవింద్ బృందం చేసేదంతా చేస్తున్నారు. కథల ఎంపిక నుంచి ప్రతిదాంట్లో జాగ్రత్త తీసుకుంటున్నారు. ఇక తదుపరి మరో యువహీరో శిరీష్ ని కూడా పైకి లేపాల్సిన బాధ్యత ఈ జోడీపై ఉంది. అయితే ఇన్నాళ్లు అరవింద్ ప్రయత్నించినా శిరీష్ కి ఎందుకనో కుదరలేదు. ఇప్పుడు శిరీష్ విషయంలో మెగాస్టార్ చిరంజీవి ఇన్వాల్వ్ అవుతున్నారని ఎట్టి పరిస్థితిలో ట్రాక్ లోకి తెచ్చే బాధ్యత తనపై వేసుకున్నారని ఓ గుసగుస వినిపిస్తోంది.
ఇప్పటికే శిరీష్ కి చాలా గ్యాప్ వచ్చింది. కథలు వింటున్నా ఓ పట్టాన జడ్జి చేయడంలో తడబాటు కనిపిస్తోంది. ఇలాంటి టైమ్ లో మావయ్య చిరంజీవి సలహా ఎంతైనా అవసరం అని భావించారట. ఇప్పటికే దర్శకుడు రాకేశ్ శశి చెప్పిన స్క్రిప్టుని ఓకే చేయడంలో మెగాస్టార్ సలహా శిరీష్ కి ఉందని చెబుతున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. సక్సెస్ కోసం సరైన కాస్టింగ్ ని కూడా ఎంపిక చేయనున్నారు. అయితే ఇంతకుముందు ఇదే దర్శకుడితో మెగాస్టార్ అల్లుడు కళ్యాణ్ దేవ్ డెబ్యూ సినిమా చేశారు. కానీ అది ఫ్లాపవ్వడం అందరినీ షాక్ కి గురి చేసింది. అయినా మరోసారి తననే నమ్మి ఇప్పుడు శిరీష్ కోసం ఎంపిక చేయడం ఎంతవరకూ కరెక్ట్? అంటూ చర్చ సాగుతోంది. అయితే చిరు జడ్జిమెంట్ ని తప్పు పట్టడం సరికాదేమో. ఒకసారి ఫెయిలైనంత మాత్రాన ఆ దర్శకుడిలో ఎబిలిటీ లేదని దూరం పెట్టేయడం జరగదు. మరో అవకాశం ఇస్తేనే కదా నిరూపించుకునేది. రాకేశ్ శశిలోని టెక్నికాలిటీస్ ని .. నేరేటర్ ని నమ్మి మరో ఛాన్స్ ఇస్తున్నారనే భావిస్తున్నారంతా. మరి దీనిపై మెగా కాంపౌండ్ స్పందిస్తే కానీ క్లారిటీ రాదు.