Begin typing your search above and press return to search.

'సైరా' ర‌న్ టైమ్ లో మెగా ఛాలెంజ్‌

By:  Tupaki Desk   |   26 July 2019 5:44 AM GMT
సైరా ర‌న్ టైమ్ లో మెగా ఛాలెంజ్‌
X
సినిమాల‌కు క్రిస్పీ ర‌న్ టైమ్ చాలా ఇంపార్టెంట్. రెండున్న‌ర గంట‌లు మించి థియేట‌ర్ లో కుర్చీల‌కు అతుక్కుని కూచోవాలంటే ఆడియెన్ లో అస‌హ‌నం చూడాల్సి ఉంటుంది. ఎప్పుడో `రంగ‌స్థ‌లం` లాంటి అరుదైన సినిమాల‌కు మాత్రమే 3 గం.ల సుదీర్ఘ స‌మ‌యం కూచోబెట్టే సామ‌ర్థ్యం ఉంటుంది. ఒక‌వేళ 3.30 గంట‌లు కూచోబెట్టే స‌త్తా ఉన్న సినిమా తీస్తే అది వేరే సంగ‌తి.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఎడిటింగ్ టేబుల్ పై ప్ర‌తిష్ఠాత్మ‌క `సైరా`కు బిగ్ ఛాలెంజ్ ఎదుర‌వుతోంద‌ట‌. ఈ సినిమాని ఎంత క‌టింగ్ చేసినా 3.30 గంట‌ల నిడివి క‌నిపిస్తోంద‌ట‌. ఆ మొత్తం ఫుటేజ్ నుంచి ఇంకా ఏం కోసేయాలి? అన్న‌దానిపై ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నార‌ని తెలుస్తోంది. ఎడిట‌ర్ తో క‌లిసి సూరి ఇప్ప‌టికే చాలా వ‌ర‌కూ ట్రిమ్ చేశారు. ఇంకో అర్థ‌గంట నిడివిని త‌గ్గించి తీరాల‌నేది ఓ టాస్క్. అయితే ఈ విష‌యంలో దృష్టి సారించాలంటే మెగా బాస్ చిరంజీవి బ‌రిలో దిగాల్సిందేన‌న్న మాటా వినిపిస్తోంది.

ఎడిటింగ్ టేబుల్ పై ఎన్నో సంద‌ర్భాల్లో ర‌న్ టైమ్ త‌గ్గించే బాధ్య‌త‌ను చిరు తీసుకుని విజ‌య‌వంతంగా ఆ ప‌ని పూర్తి చేశారు. అలా ఎన్నో సినిమాలు ల్యాగ్ బెడ‌ద నుంచి త‌ప్పుకున్నాయి. ఎక్క‌డ ఉంచాలి? ఎక్క‌డ తుంచాలి? అన్న‌ది చిరు దృక్కోణంలోంచి ద‌ర్శ‌కుడు ప‌రిశీలిస్తే ప‌ని చాలా సులువు అయిపోతుంద‌న్న టాక్ ఉంది. చివ‌రికి ఏం చేసినా `సైరా- న‌ర‌సింహారెడ్డి` నిడివి 3 గంట‌ల‌కు తేవాల్సి ఉంది. అందుకే ఇప్పుడు చిరు అందుకు రెడీ అవుతున్నార‌ని తెలుస్తోంది. ఇప్పుడే ర‌న్ టైమ్ 30 నిమిషాలు త‌గ్గించ‌గ‌లిగితే ఆ మేర‌కు వీఎఫ్ ఎక్స్ ప‌నుల‌కు ఆ ఎక్స్ ట్రా ఖ‌ర్చు కూడా త‌గ్గుతుంది. అన‌వ‌స‌రంగా ఖ‌ర్చు చేయ‌కుండా మిగిల్చే వీలుంటుంది. అక్టోబ‌ర్ 2న `సైరా` రిలీజ్ తేదీ అంటూ ప్ర‌క‌టించారు. ఇంకో రెండు నెల‌ల స‌మ‌యం మాత్ర‌మే మిగిలి ఉంది. ఈలోగానే ఎడిటింగ్ స‌హా వీఎఫ్ ఎక్స్ పెండింగ్ ప‌నులు పూర్తి చేయాల్సి ఉంది. చిరు త‌దుప‌రి కొర‌టాల‌తో సినిమాకి స‌న్నాహ‌కాల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే.