Begin typing your search above and press return to search.
భీమ్లా సక్సెస్ కి గాడ్ ఫాదర్ రియాక్షన్ ఇదే
By: Tupaki Desk | 26 Feb 2022 6:00 AM ISTపవన్ కళ్యాణ్.. రానా కలిసి నటించిన భీమ్లా నాయక్ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు ఏడాది పాటు వెయిట్ చేస్తున్న అభిమానుల కోసం ఎట్టకేలకు ఈ సినిమా ను విడుదల చేయడం జరిగింది. టికెట్ల ఇష్యూ ఒక వైపు చర్చనీయాంశంగా ఉన్న ఈ స మయంలో నే భీమ్లా నాయక్ సినిమా ను విడుదల చేయడం జరిగింది. భీమ్లా నాయక్ సినిమా షూటింగ్ మొదలు అయినప్పటి నుండి కూడా అంచనాలు భారీగా ఉన్నాయి.
సినిమా విడుదల అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో అభిమానుల నుండి మొదలుకుని ఇండస్ట్రీ స్టార్స్ మరియు సూపర్ స్టార్స్ వరకు స్పందిస్తూ ఉన్నారు. భీమ్లా నాయక్ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో మెగా స్టార్ చిరంజీవి స్పందించాడు. సినిమా సక్సెస్ సాధించిన నేపథ్యంలో భీమ్లా నాయక్ మరియు డేనియల్ శేఖర్ లతో తాను ఉన్న ఫోటోను షేర్ చేసి కంగ్రాట్స్ చెప్పాడు.
నిజమైన పవర్ స్ట్రామ్ అంటూ చిరంజీవి ట్వీట్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ ల వీడియో సినిమా విడుదలకు ముందు రామ్ చరణ్ ఇన్ స్టా లో షేర్ చేసి అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెల్సిందే. ఇప్పుడు తమ్ముడు పవన్ కళ్యాణ్ సక్సెస్ కి చిరంజీవి కంగ్రాట్స్ చెప్పడంతో మెగా అభిమానులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వద్దకు చిరంజీవి ఇండస్ట్రీ పెద్ద హోదాలో వెళ్లి చేతులు జోడించి టికెట్ల రేట్ల ను పెంచాల్సిందిగా కోరడంతో పవన్ కళ్యాణ్ కోపంగా ఉన్నాడనే వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలో చిరంజీవి నుండి ఇలాంటి ట్వీట్ రావడం తో ఇద్దరి మద్య ఎలాంటి వివాదాలు.. విభేదాలు వ్యక్తిగతంగా లేవు అని క్లారిటీ వచ్చినట్లయ్యింది.