Begin typing your search above and press return to search.

మెగా డాటర్ రూటు మారుస్తుందా ?

By:  Tupaki Desk   |   8 July 2019 10:35 AM IST
మెగా డాటర్ రూటు మారుస్తుందా ?
X
మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుంచి ఎందరు హీరోలు వచ్చినా వస్తూనే ఉన్నా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఒకే ఒక్క మెగా హీరోయిన్ గా నీహారికకు అభిమానుల్లో ప్రత్యేక గుర్తింపు ఉండేది. మొదటి సినిమా ఒక మనసు పేరు తెచ్చింది కానీ కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యింది. ఆ తరువాత తమిళ్ లో విజయ్ సేతుపతితో చేసిన డెబ్యూ మూవీ అక్కడా అదే ఫలితాన్ని అందుకుంది.

సరే అని హ్యాపీ వెడ్డింగ్ తో మరో లవ్ స్టోరీ ట్రై చేస్తే అదీ తేడా కొట్టింది. ఇంకో ప్రయత్నంగా తనతో వెబ్ సిరీస్ ని సక్సెస్ ఫుల్ గా నడిపించిన దర్శకుడు ప్రణీత్ తో సూర్యకాంతం చేస్తే పైవాటికి ఏ మాత్రం తీసిపోని డిజాస్టర్ గా నిలిచింది. ముచ్చటగా మూడు సినిమాలతోనే నీహారిక మార్కెట్ ను పూర్తిగా డేంజర్ లో పడేసుకుంది.ఇప్పటిప్పుడు చేతిలో కమిట్ మెంట్స్ కూడా ఏమి లేవు.

అందుకే నటన అచ్చిరాలేదు కాబట్టి నిర్మాణం వైపు నీహారిక అడుగులు వేస్తున్నట్టుగా ఇన్ సైడ్ టాక్. నాన్న నాగబాబు మార్గదర్శకత్వంలో అన్నయ్య వరుణ్ తేజ్ సూచనలతో త్వరలో ఓ ఇండిపెండెంట్ బ్యానర్ మొదలు పెట్టె ఆలోచనలో ఉందట. అయితే కేవలం సినిమాలకే పరిమితం కాకుండా తనకు పేరు తీసుకొచ్చిన వెబ్ సిరీస్ లను కంటిన్యూ చేస్తుందట. ఎలాగూ కుటుంబంలో పదికి పైగానే హీరోలు ఉన్నారు. ఏడాదికి ఒకటో రెండో చేయాలనుకున్నా వాళ్లలో ఎవరో ఒకరు ఓకే చెప్తారు. సరైన టీమ్ ని దర్శకుడిని ఎంచుకుంటే చాలు. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో త్వరలో మా నాన్న నాకు పెళ్లి చేస్తారు అని చెప్పిన నీహారిక మరి నిర్మాతగా మారే ఆలోచన సీరియస్ గానే చేస్తోందా లేదా వేచి చూడాలి