Begin typing your search above and press return to search.
'లూసిఫర్' రీమేక్ పై మెగా నిర్ణయం!
By: Tupaki Desk | 12 April 2021 11:43 AM GMTఆరు పదుల వయసులోనూ మెగాస్టార్ కుర్రాడిలా జోరు చూపిస్తున్నారు. రీ-ఎంట్రీ తర్వాత వరుస సినిమాలు ప్రకటిస్తూ.. అలనాటి చిరును తలపిస్తున్నారు. ఈ మధ్యనే ఆచార్యకు గుమ్మడి కాయ కొట్టేసిన మెగాస్టార్.. లూసీఫర్ ను పట్టాలెక్కించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. కానీ.. ఈ స్పీడుకు కరోనా బ్రేక్ వేస్తోంది.
కొవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో.. చాలా రాష్ట్రాలు అప్రమత్తమైన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర వంటి చోట వీకెండ్ లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ వంటివి అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు కూడా థియేటర్లపై ఆంక్షలు విధించొచ్చని ప్రచారం సాగుతోంది. ఈ కారణం చేతనే సమ్మర్ లో రావాల్సిన సినిమాలన్నీ వాయిదా పడుతున్నాయనే చర్చ కూడా నడుస్తోంది.
ఈ క్రమంలో మే 13న రావాల్సిన ఆచార్య రిలీజ్ డేట్ కూడా మారబోతోందనే డిస్కషన్ గట్టిగానే సాగుతోంది. ఈ వార్తలతోనే మెగా ఫ్యాన్స్ నిరాశకు గురవుతుండగా.. ఇప్పుడు మరో న్యూస్ తెరపైకి వచ్చింది. లూసీఫర్ ను ఏప్రిల్ సెకండ్ వీక్ నుంచే మొదలు పెట్టాలని అనుకున్నారు. కానీ.. అనివార్య కారణాలతో మే నెలకు పోస్ట్ పోన్ అయ్యింది.
ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ ఏమంటే.. సినిమా షూట్ మొత్తానికి వాయిదా వేశారని అంటున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సెకండ్ వేవ్ ముంచుకొస్తున్న తరుణంలో షూటింగ్ లు నిర్వహిస్తే.. ఇబ్బందులు ఎదురవుతాయని మెగాస్టార్ తోపాటు యూనిట్ భావిస్తోందని సమాచారం. మరి, ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియదుగానీ.. వాయిదా వేసే ఛాన్సే ఎక్కువ అంటున్నారు.