Begin typing your search above and press return to search.
MEGA FAMILY 39 మంది పిల్లల కథ?
By: Tupaki Desk | 29 Oct 2019 4:53 AM GMTనేను ఊసరవెల్లిలా రంగులు మారుస్తాను. నా మాట నేనే వినను. నేనింతే.. నా ఇష్టం ఇలా ఉంటుంది ఆర్జీవీ వాలకం. తన మాటకు తానే కట్టుబడి ఉండని తుగ్లక్ ని అని అంగీకరించారు ఆయనకు ఆయనే. అందువల్ల ఈ ప్రకటన అభిమానులకు పెద్దగా ఆశ్చర్యం కలిగించి ఉండకపోవచ్చు.
ఊకదంపుడు ఊదరగొట్టుడు ప్రచారంలో భాగంగానే అతడు కొద్ది రోజులుగా 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' చిత్రానికి ప్రచారం ఊదరగొట్టేస్తున్నాడు. ఆ సినిమాకి ప్రచారం చేసుకోవడం కోసం నానా గడ్డి కరుస్తున్నాడు. ఇష్టానుసారం ఏదో ఒకటి నోటికొచ్చింది వాగి నచ్చినట్టు చేస్తున్నాడు. ఆ తరహా ప్రకటనే MEGA FAMILY పై సినిమా.
మెగా ఫ్యామిలీ నా తదుపరి చిత్రం.. అంటూ టైటిల్ నే ప్రకటించేసిన ఆర్జీవీ ఇంతలోనే తూచ్ నేను ఈ సినిమా చేయడం లేదు అంటూ షాకిచ్చాడు. అందుకు కారణం కూడా చెప్పాడు. 'మెగా ఫ్యామిలీ కథాంశం .. ఒక మనిషికి మొత్తం 39 మంది పిల్లలు. అంతమంది పిల్లలు ఆ కుటుంబంలో ఉన్నారు కాబట్టి నేనే పిల్లల సినిమాలు సరిగా తీయలేను. ఐ యామ్ నాట్ గుడ్. అందుకే సినిమా తీయాలనుకోవడం లేదు' అంటూ గాలి తీసేశాడు. మొత్తానికి ఆర్జీవీ ప్రమోషనల్ స్టంట్ ఇది అని ప్రూవైంది. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్రానికి ప్రచారం చేసుకోవడానికి అతడు ఈ తరహా ఎత్తుగడలు ఎన్నో వేస్తున్నాడు. ప్రతిదీ సెన్సేషన్ చేయడం ద్వారా తాను ఆశించిన ఉచిత పబ్లిసిటీ దక్కుతోంది. అందుకే ఇలా రకరకాలుగా జనాల్ని మభ్య పెడుతూ పబ్బంగడుపుతున్నాడు.