Begin typing your search above and press return to search.

వాటాల వారీలుగా వస్తున్న ఫ్యామిలీలు..

By:  Tupaki Desk   |   28 Oct 2015 5:30 PM GMT
వాటాల వారీలుగా వస్తున్న ఫ్యామిలీలు..
X
గతకొన్ని నెలలుగా సినిమాలు విడుదలవుతున్న తీరు చూస్తుంటే ఇండస్ట్రీలో ఇతర హీరోలతో కాంపిటీషన్ కంటే తమ సొంత కుటుంబం హీరోలతో పోటీ పడడం ఉత్తమమని తెలిసుకుని టాలీవుడ్ లో మూడు పెద్ద ఫ్యామిలీలు ఆ విధంగా అడుగులేస్తున్నట్టు కనిపిస్తుంది.

బాహుబలి - శ్రీమంతుడు తరువాత ఇప్పటివరకూ ద్వితీయార్ధమంతా మెగా మానియానే నడిచింది. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ - బ్రూస్ లీ - కంచె అంటూ మెగా హీరోలు మినిమమ్ గ్యాప్ తీసుకుని మనముందు ప్రత్యక్షమవుతున్నారు.

ఇక నవంబర్ అంతా అక్కినేని వారి హంగామా మొదలుకానుంది. అఖిల్ - సోగ్గాడే చిన్ని నాయన - ఊపిరి - సాహసమే శ్వాసగా సాగిపో వంటి సినిమాలు ఈ ఏడాది చివర్లో విడుదలకావడానికి కంకణం కట్టుకున్నాయి.

ఆపైన వచ్చే ఏడాది ప్రదమార్ధమంతా నందమూరి వారి నాయకత్వంలో సాగనుంది. బాలయ్య 99వ సినిమా డిక్టేటర్ - తారక్ నాన్నకు ప్రేమతో సినిమాలు ప్రేక్షకులను సందడి చేయనున్నాయి. ఇలా విడతల వారీగా ఫ్యామిలీ ప్యాకేజిలు రావడం కూడా ఒకవిధంగా మంచిదే..