Begin typing your search above and press return to search.
#నిశ్చయ్.. పెళ్లిలో మెగా డ్రెస్ కోడ్ ని పరిశీలించారా?
By: Tupaki Desk | 11 Dec 2020 2:30 PM GMTమెగా ఫ్యామిలీలో ఏ వేడుక జరిగినా దానికో ప్రత్యేకతను ఆపాదించేందుకు మెగా ప్లానింగ్ తప్పనిసరి. ఇంతకుముందు చాలా ఈవెంట్లలో డ్రెస్ కోడ్ అనేది ప్రధానంగా హైలైట్ అయ్యింది. మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక వివాహంలోనూ ఈసారి అదే ట్రెడిషన్ కొనసాగింది. ప్రస్తుతం మెగా వెడ్డింగ్ లో డ్రెస్ కోడ్ పై అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.
మెగా వెడ్డింగ్స్ లో ప్రధానంగా.. చూస్తే.. రామ్ చరణ్ .. బన్ని పెళ్లి వేడుకలు అప్పట్లో శ్రీజ పెళ్లి వేడుక .. లేటెస్టుగా నిహారిక వివాహ మహోత్సవం వీడియోలు పరిశీలిస్తే తెలిసేది ఒకటే. ఈ పెళ్లిలో కంటికి ఇంపు అనిపించే డిజైనర్ థీమ్ హైలైట్ గా ఉంటుంది. ఏదో ఒక డ్రెస్ వేసుకుని వచ్చేయరు. చిరు- పవన్ - చరణ్- బన్ని- తేజ్- వరుణ్ -శిరీష్ ఇలా కుటుంబ హీరోలంతా ఒకే తరహాలో నియరెస్ట్ డిజైనర్ లుక్ లో కనిపిస్తారు. మగువలంతా ప్రత్యేకించి సాంప్రదాయకమైన యాప్ట్ డ్రెస్సుల్లోనే దర్శనమిస్తారు.
నిహారిక సంగీత్.. మెహెందీ కార్యక్రమం అటుపై పెళ్లి వేడుకలో ఇది బహిర్గతమైంది. మెగా ఫ్యామిలీ హీరోలంటే డ్యాన్సులకు ప్రసిద్ధి. మెగా ఈవెంట్ అంటే డ్యాన్సులతో అదరగొట్టాలి. ఇలాంటి వేడుకల్లో టోటల్ మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యుల కచ్ఛితంగా దుస్తుల కోడ్ ను అమలు చేస్తున్నారు. ఎంపిక చేసుకునే రంగు డిజైన్ ప్రతిదీ అందరికీ మ్యాచింగ్ తప్పనిసరి. పెళ్లిళ్లు శుభకార్యాల్లో పసుపు గోల్డ్ షైన్ లేదా పింక్ అండ్ వైట్ మిక్సింగ్ డిజైనర్ డ్రెస్సుల్ని ధరించి కజిన్స్ లో బలమైన బంధాన్ని ఎలివేట్ చేస్తారు.
మెగా వివాహాల్లో రిపీటెడ్ గా ఈ ప్రత్యేకమైన విషయాలన్నీ ప్రతి ఒక్కరూ వేడుకను విస్మయంతో చూసేలా చేస్తాయి. మరెన్నో ‘మెగా’ వివాహాలు రాబోయే రెండు సంవత్సరాల్లో ఇదే తీరుగా కనిపిస్తాయనడంలో సందేహమేం లేదు. ప్రతిసారీ ఇలా ఏదైనా చక్కని థీమ్ తో డ్రెస్ కోడ్ తో రంజింపజేయడం అయితే కామన్ గా ఉంటుంది.