Begin typing your search above and press return to search.
ఛానల్స్ నిషేధంపై మెగా మాట ఇదే
By: Tupaki Desk | 1 May 2018 4:59 PM GMTతెలుగు సినీ రంగం వర్సెస్ న్యూస్ ఛానల్స్ అన్నట్లుగా సాగుతున్న వ్యవహారం ఓ కొలిక్కి వచ్చేసిందని.. మే 2వ తేదీ నుంచి ఏ న్యూస్ ఛానల్ కు ఎలాంటి సినిమా కంటెంట్ ఇవ్వకూడదని డిసైడ్ అయిపోయారని వార్తలు వచ్చాయి. నిజానికి సినిమా ఇండస్ట్రీ నుంచి ఈ పదిమంది స్పోక్ పర్సన్స్ అంటూ ప్రెస్ నోట్ మినహా.. మరేవిధమైన అధికారిక ప్రకటన లేదు.
కానీ న్యూస్ ఛానల్స్ ఎడిటర్లు భేటీ అయి.. ఓ హెచ్చరిక లాంటి నోట్ కూడా జారీ చేసేశారు. ఇవాల్టి అర్ధరాత్రి నుంచి.. అంటే మే 2నుంచి న్యూస్ ఛానల్స్ ను నిషేధించడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పుకొచ్చాడు మెగా బ్రదర్ నాగేంద్ర బాబు. అసలు తమకు అలాంటి ఆలోచన ఏదీ లేదన్నది నాగబాబు ఉవాచ. ఎవరో ఏదో చెప్పారని.. అవన్నీ పట్టుకుని అనవసరమైన రాద్ధాం చేసుకుంటున్నారని ఆయన అభిప్రాయపడ్డాడు. తాము పలు మార్లు చర్చించిన మాట నిజమే అయినా.. తెలుగు సినీ పరిశ్రమకు ఏం చేస్తే మంచి జరుగుతుంది అన్న అంశంపై మాత్రమే చర్చించామని చెప్పుకొచ్చారు.
ఇప్పటికి అయితే ఛానల్స్ పై నిషేధం లాంటి నిర్ణయాలు లేవని తేల్చి చెప్పిన నాగబాబు.. తాను నిర్మాణం వహించిన నా పేరు సూర్యపై.. అప్పుడే కొన్ని ఛానళ్లు.. పోర్టల్స్ లో వ్యతిరేక ప్రచారం జరుగుతుండడాన్ని ఖండించాడు. సినిమా చూసి అప్పుడు ఎవరైనా ఏమైనా మాట్లాడచ్చని.. కానీ మూవీ రిలీజ్ కి ముందే ఇలా ప్రతికూల ప్రచారం చేయడం సరికాదని అన్నాడు నాగేంద్రబాబు.